'ప్రేమలు' సినిమా నుంచి క్రేజీ సాంగ్‌ విడుదల | Premalu 2024 Telugu Movie Mini Maharani Video Song Out Now, Check OTT Release Update - Sakshi
Sakshi News home page

Premalu Movie Songs: 'ప్రేమలు' సినిమా నుంచి క్రేజీ సాంగ్‌ విడుదల.. ఓటీటీలో మరింత ఆలస్యం

Published Fri, Mar 29 2024 8:42 PM | Last Updated on Sat, Mar 30 2024 5:40 PM

Premalu Telugu Movie Video Song Out Now - Sakshi

మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'ప్రేమలు'. అక్కడ సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాను తెలుగులో అగ్ర‌ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్ రాజ‌మౌళి త‌న‌యుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. . తెలుగు వెర్ష‌న్ మార్చి 8న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా బ్లాక్‌ బస్టర్‌ కొట్టింది. ప్రస్తుతం ఓటీటీ విడుదల తేదీని ప్రకటించే పనిలో మేకర్స్‌ ఉన్నారు.

కేవలం రూఏ. 3కోట్లతో తెరకెక్కిన ప్రేమలు చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ త‌న స్నేహితుల‌తో క‌లిసి నిర్మించాడు. బాక్సాఫీస్‌ వద్ద ప్రస్తుతం రూ. 130 కోట్ల మార్క్‌ను దాటింది. తెలుగులో కూడా ఇప్పటి వరకు రూ.15 కోట్లు రాబట్టింది. మార్చి 29న ఓటీటీలోకి వస్తుందని రూమర్స్‌ వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా కలెక్షన్స్‌ పరంగా బెటర్‌గా ఉండటంతో ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని డిస్ట్రీబ్యూటర్స్‌ నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో చిత్ర మేకర్స్‌ కాస్త తగ్గారు. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ రెండో వారంలో డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో మేకర్స్‌ ఉన్నట్లు సమాచారం.

తాజాగా ప్రేమలు చిత్రం నుంచి మిని మహారాణి సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాట థియేటర్లో యమ క్రేజీగా క్లిక్‌ అయింది. మంచి మ్యూజిక్‌తో సాగే ఈ పాట ఇప్పటికి నెట్టింట ట్రెండ్‌లో ఉంది. ఈ సినిమాలో త‌న క్యూట్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న‌ది మ‌మితా బైజు. ప్రేమ‌లుతో ఓవ‌ర్‌నైట్‌లోనే స్టార్‌గా మారిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement