ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ నావల్ టాటా బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని దేశవిదేశాల్లో విస్తరించి పేరు గడించారు. తన సంపదలో దాదాపు 65 శాతం భాగాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు. ఆపై యువకులు స్థాపించే పలు స్టార్టప్ కంపెనీల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అందుకే ఆయన్ను దేశ ప్రజలందరూ అభిమానిస్తారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలుడైన పారిశ్రామికవేత్త ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లడంతో రతన్ టాటా గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఆయన అభిమానులు అందరూ సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. ఆయనకు సంబంధించిన బయోపిక్, డాక్యుమెంటరీలు ఏమైనా ఉన్నాయా..? అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఆయన గురించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఒక ఎపిసోడ్‌ను చేసింది. 'మెగా ఐకాన్స్' పేరుతో ఆ ఓటీటీ సంస్థ గతంలోనే పంచుకుంది. సీజన్2 నుంచి ఎపిసోడ్2లో రతన్ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అందులో అరుదైన ఫోటోలతో పాటు.. ఆయన గురించి పూర్తి విషయాలను వీడియో రూపంలో పంచుకున్నారు. ఈ డాక్యుమెంటరీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ వంటి భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. డాక్యుమెంటరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ డాక్యుమెంటరీ ఆసియా టెలివిజన్ వేదికపై ఉత్తమ డాక్యుమెంటరీగా టైటిల్‌ను అందుకుంది. అయితే, రతన్ టాటా బయోపిక్‌ను ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర తీయనున్నట్లు రెండేళ్ల క్రితం వార్తలు వచ్చాయి. కానీ, ఈ వార్తల్లో నిజం లేదని ఆమె పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment