మొబైల్ ఫోన్ వచ్చాక చాలావాటి అవసరం తగ్గిపోయింది. ఉత్తరాలు, ల్యాండ్ లైన్లు, రేడియో.. ఇలా చాలావాటి అవసరమే లేకుండా పోయింది. టీవీకి అతుక్కుపోయేవారిని సైతం తనవైపు తిప్పుకుంది. ఓటీటీల పుణ్యమా అని థియేటర్‌కు క్యూ కట్టేవాళ్లను సైతం తాపీగా ఇంట్లోనే కూర్చోబెట్టి పెద్దగా కష్టపడే పని లేకుండా బోలెడంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. థియేటర్‌లో ఎక్కువరోజులు ఆడిన సినిమాతో పాటు, ఆడలేకపోయిన సినిమాలనూ అందుబాటులోకి తీసుకువస్తోంది.
అంతేనా... కొత్త తరహా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యు సిరీస్‌లు, రియాలిటీ షోలు.. ఇలా బోలెడంత కంటెంట్ ఇస్తున్నాయి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్. దీంతో అటు బాక్సాఫీస్‌లో ఏయే సినిమాలు రిలీజవుతున్నాయని కన్నేసేవారంతా కూడా ఓటీటీలోనూ ఏయే చిత్రాలు, సిరీస్‌లు విడుదలవుతున్నాయని మరో కన్నేసి ఉంచుతున్నారు. మరి ఈ రెండు రోజుల్లో(అక్టోబర్ 5,6) ఏయే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయో చూసేద్దాం..
నెట్‌ఫ్లిక్స్
► మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి- అక్టోబర్ 5
► ఖుఫియా - అక్టోబర్ 5
► లుపిన్, పార్ట్ 3(వెబ్ సిరీస్) - అక్టోబర్ 5
► ఎవ్రీథింగ్ నౌ(వెబ్ సిరీస్) - అక్టోబర్ 5
► బాలెరినా - అక్టోబర్ 6
► ఫెయిర్ ప్లే - అక్టోబర్ 6
► ఇన్‌సీడియస్: ద రెడ్ డోర్ - అక్టోబర్ 6
► ఎ డెడ్లీ ఇన్విటేషన్ - అక్టోబర్ 6
హాట్‌స్టార్
► లోకి సీజన్ 2 (వెబ్ సిరీస్) - అక్టోబర్ 6 నుంచి ప్రారంభం (ప్రతివారం కొత్త ఎపిసోడ్ రిలీజ్)
► ఇంఫీరియర్ డెకొరేటర్ - అక్టోబర్ 6
► క్యాంపింగ్ ఔట్ - అక్టోబర్ 6
► చిప్స్ అహోయ్- అక్టోబర్ 6
► ఓల్డ్ మెక్‌డొనాల్డ్ డక్ - అక్టోబర్ 6
► వింకెన్, బ్లింకెన్ అండ్ నాడ్ - అక్టోబర్ 6
► వెన్ ద క్యాట్స్ అవే - అక్టోబర్ 6
► ఫిడ్‌లింగ్ అరౌండ్ - అక్టోబర్ 6
అమెజాన్ ప్రైమ్ వీడియో
► మిస్టర్ ప్రెగ్నెంట్ - అక్టోబర్ 6
► ముంబై డైరీస్ (రెండో సీజన్) - అక్టోబర్ 6
► టోటల్లీ కిల్లర్ - అక్టోబర్ 6
► డిస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్: ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ యూనివర్స్ - అక్టోబర్ 6
లయన్స్ గేట్ ప్లే
► జాయ్ రైడ్ - అక్టోబర్ 6
► మింక్స్ ( రెండో సీజన్) - అక్టోబర్ 6
జీ5
► గదర్ 2 - అక్టోబర్ 6
సినీ బజార్
► నీ వెంటే నేను - అక్టోబర్ 6
బుక్ మై షో
► గ్రాన్ టరిష్మో - అక్టోబర్ 5
► ఆస్టరాయిడ్ సిటీ - అక్టోబర్ 6
జియో సినిమా
► గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబర్ 6
చదవండి: త్వరలో మంగ్లీ పెళ్లి అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన సింగర్..
Comments
Please login to add a commentAdd a comment