తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే చాలామందికి 'బిగ్‌బాస్' గుర్తొస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడో సీజన్ ప్రసారమవుతోంది. ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైన ఈ షోని ఇప్పుడు అర్ధాంతరంగా ఆపేశారు. అవును మీరు సరిగానే విన్నారు. అయితే ఇదంతా కూడా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా చేసిన పని అని తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగింది?
తెలుగులో 'బిగ్‌బాస్' రియాలిటీ షో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పొచ్చు. తొలి రెండు సీజన్లు మంచి ఆసక్తి చూసిన ప్రేక్షకులకు ఆ తర్వాత కాస్త ఇంట్రెస్ట్ తగ్గిందని చెప్పొచ్చు. కంటెస్టెంట్స్ పెద్దగా పేరున్న వాళ్లు లేకపోవడం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. ఇకపోతే ప్రస్తుత సీజన్‌లోనూ 14 మంది కంటెస్టెంట్స్ హౌసులోకి అడుగుపెట్టారు. ఆల్రెడీ గేమ్స్, టాస్కులు ఆడేస్తున్నారు. మధ్య మధ్యలో గొడవలూ జరుగుతున్నాయి.
(ఇదీ చదవండి: ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్.. మరో కొత్త ట్విస్ట్!)
అయితే టీవీల్లో రాత్రి 'బిగ్‌బాస్ 7' ఎపిసోడ్ ప్రసారమవుతుండగా.. మరోవైపు 24x7 హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు దాన్ని సడన్ గా ఆపేశారు. ఆదివారం రాత్రి 10:30 తర్వాత తిరిగి ప్రసారం చేస్తామని ప్రకటించారు. దీనికి కారణం ఉందని తెలుస్తోంది. 24 గంటలు ప్రసారం చేస్తుండటం వల్ల రాత్రి ఎపిసోడ్ టెలికాస్ట్ కావడానికి ముందే విజేతలు, టాస్క్ వివరాలు లాంటివి తెలిసిపోతున్నాయి.
ఇక వీకెండ్(శని-ఆదివారం) అంటే నాగార్జున రావడంతో పాటు అందరినీ నిలబెట్టి మరీ వాయించేస్తాడు. అది కూడా ముందే తెలిసిపోతే ఎపిసోడ్ చూసేవాళ్లకు కిక్ పోతుంది. అందుకని ఈ రెండు రోజులు మాత్రం లైవ్ ఉండదు. గత సీజన్ల నుంచి ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. ఈసారి కూడా బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్ వీకెండ్ వచ్చేసరికి 24 గంటల స్ట్రీమింగ్ ఆపేసింది. టీవీలో యథావిధిగా షో టెలికాస్ట్ అవుతుంది.
(ఇదీ చదవండి: 'జవాన్'లో షారుక్‌కి డూప్.. ఎంత రెమ్యునరేషనో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment