ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఐదు హాఫ్ సెంచరీలు బాదిన కోహ్లి మంచి ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అదే సమయంలో గంభీర్‌తో గొడవ.. నవీన్ ఉల్ హక్‌తో వైరం కారణంగా కోహ్లి నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. గంభీర్-కోహ్లి గొడవ జరిగి వారం కావొస్తున్నా.. నవీన్ ఉల్ హక్ మాత్రం కోహ్లిని గెలుకుతూనే ఉన్నాడు. అయితే కోహ్లి కూడా ధీటుగానే స్పందిస్తూ వస్తున్నాడు.
ఈ విషయం పక్కనబెడితే.. గురువారం కోహ్లి డిస్నీ హాట్‌స్టార్ నిర్వహిస్తున్న 'Let There Be Sport' అనే కార్యక్రమానికి హాజరయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ జతిన్ సప్రూతో జరిగిన ఇంటర్య్వూను కోహ్లి స్వయంగా తన ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. ఈ ఇంటర్వ్యూలో కోహ్లి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ధోని లాంటి క్రికెటర్ల నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు పేర్కొన్నాడు.
కోహ్లి మాట్లాడుతూ..'' ఎంఎస్ ధోని సహా కొంతమంది క్రికెటర్ల నుంచి చాలా నేర్చుకున్నా. మనల్ని నడిపిస్తున్న వ్యక్తులను ప్రతీసారి సంతోషంగా ఉంచలేము. ఎందుకంటే నిజం అనేది కొన్నిసార్లు సంతోషాన్ని ఇస్తే.. కొన్నిసార్లు బాధను ఇస్తుంది. మన చుట్టు ఉన్న వాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పటికి పరిస్థితుల ప్రభావం దృశ్యా అది నెగటివిటీగా మారే అవకాశం ఉంటుంది.
సౌకర్యవంతమైన మార్గాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు.వీటిని ఒక్కోసారి విస్మరించవలసి ఉంటుంది ఎందుకంటే మనం చూసే ధోరణి కీలకపాత్ర పోసిస్తుందన్నది నా నమ్మకం. ఇలాంటి జీవిత సత్యాలను ధోని లాంటి వ్యక్తుల నుంచి నేర్చుకున్నా అంటూ'' తెలిపాడు.
It’s a long road to the top but the greatest lessons are learnt when you get knocked down and get back up.
— Virat Kohli (@imVkohli) May 11, 2023
Let There Be Sport with @pumacricket, now streaming on @DisneyPlusHS. #LetThereBeSport #ad pic.twitter.com/dymvO8G4HK
ఇక ధోని-కోహ్లిలు కలిసి చాలాకాలం టీమిండియా తరపున క్రికెట్ ఆడారు. తొలుత ధోని కెప్టెన్సీలో కోహ్లి ఆడితే.. ఆ తర్వాత కోహ్లి కెప్టెన్సీలో ధోని ఆడాడు. అయితే ధోని సలహాలకు కోహ్లి చాలా ప్రాముఖ్యత ఇచ్చేవాడు. కెప్టెన్సీ నేర్చుకునే దశలో ధోని కోహ్లికి అండగా నిలబడ్డాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
'Let There Be Sport' కార్యక్రమం ద్వారా సునీల్ ఛెత్రీ, యువరాజ్ సింగ్, హర్మన్ ప్రీత్ కౌర్ లాంటి దిగ్గజాలను ఇంటర్య్వూ చేశారు. క్రీడాకారుల జీవితాలో జరిగిన పలు సంఘటనలను అడిగి తెలుసుకోవడం ఈ క్యార్యక్రమం ప్రత్యేకత.
Comments
Please login to add a commentAdd a comment