
ధోనితో కోహ్లి (Photo Credit: Virat Kohli Instagram/IPL)
IPL 2023- RCB Vs CSK: మహేంద్ర సింగ్ ధోని.. విరాట్ కోహ్లి.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేర్లు. ఒకరు భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందిస్తే.. మరొకరు తన ఆట, కెప్టెన్సీతో అభిమానుల మనసు కొల్లగొట్టిన వారు. ఇక ఈ టీమిండియా మాజీ సారథుల మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిస్టర్ కూల్ ధోని అంటే కోహ్లికి మాటల్లో చెప్పలేనంత అభిమానం.
అన్నలా అండగా నిలబడి
టీమిండియాలో కీలక బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా ఎదగడంలో అతడికి ధోని అన్ని విధాలా సహకరించాడు. కోహ్లి ప్రతిభ నిరూపించుకునే క్రమంలో వరుస అవకాశాలు రావడానికి దోహదం చేస్తూ అన్నలా అండగా నిలబడ్డాడు. ఇక తనకు సరైన వారసుడు కోహ్లినే అని నమ్మిన తలైవా.. అతడిని కెప్టెన్ చేయడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా.. తన ‘జూనియర్’ సారథ్యంలో ఆడాడు కూడా!
తలైవాను కలిసిన కింగ్
అంతేకాదు కెరీర్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న వేళ కోహ్లికి మద్దతుగా నిలిచాడు. ఈ విషయాన్ని విరాట్ కోహ్లినే స్వయంగా వెల్లడించాడు. తనకు అన్నయ్యలా మారిన ఇలాంటి గొప్ప నాయకుడు మరెవరూ ఉండరంటూ సందర్భం వచ్చినపుడల్లా అభిమానం చాటుకుంటూనే ఉంటాడు.
ఇక తాజాగా మరోసారి ధోనిపై ప్రేమను కురిపిస్తూ షేర్ చేసిన ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.
ఇద్దరు దిగ్గజాలు
హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 8 పరుగుల తేడాతో సీఎస్‌కే చేతిలో ఓటమి పాలైంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ సందర్భంగా ధోనిని కలిసిన కోహ్లి అతడితో సరదాగా ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎల్.. ‘‘ఇద్దరు దిగ్గజాలు’’ అంటూ సోషల్ మీడియాలో పంచుకుంది.
ఇదిలా ఉంటే.. ధోనిని ఆత్మీయంగా హత్తుకున్న ఫొటోను విరాట్ కోహ్లి మ్యాచ్ అనంతరం తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘తలాకు బిగ్గెస్ట్ ఫ్యాన్‌బాయ్’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: హ్యాట్సాఫ్.. ఆర్సీబీకి దొరికిన ఆణిముత్యం! 38 ఏళ్ల వయసులో.. నొప్పిని భరిస్తూనే..
Virat Kohli: దూకుడు ఎక్కువైంది.. కోహ్లికి ఊహించని షాకిచ్చిన బీసీసీఐ!
A legendary duo 🙌@imVkohli 🤝 @msdhoni
— IndianPremierLeague (@IPL) April 17, 2023
❤️ 💛#TATAIPL | #RCBvCSK pic.twitter.com/5sOQDkdBLb