ఒక్కరోజే 10 సినిమాలు స్ట్రీమింగ్‌.. ఆ రెండు చిత్రాలే స్పెషల్‌! | This Weekend Ott Release Movies List Goes Viral | Sakshi
Sakshi News home page

Weekend Ott Releases: ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్కరోజే 10 సినిమాలు!

Published Thu, May 16 2024 9:09 PM | Last Updated on Thu, May 16 2024 9:12 PM

This Weekend Ott Release Movies List Goes Viral

చూస్తుండగానే మరో వీకెండ్‌ వచ్చేసింది. ఈ వారంలో థియేటర్ల వద్ద చిన్న సినిమాలు సందడి చేయనున్నాయి. స్టార్ హీరోల సినిమాలేవీ రిలీజ్ కాకపోవడంతో సినీ ప్రియులంతా ఓటీటీలవైపే చూస్తున్నారు. దీంతో ఓటీటీలు సైతం సరికొత్త కంటెంట్‌తో వినోదం అందించేందుకు రెడీ అయ్యాయి.

ఎప్పటిలాగే ఈ వీకెండ్‌లో అలరించేందుకు సినిమాలు వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. ఆదాశర్మ నటించిన బస్తర్, రాజమౌళి బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) ఆడియన్స్‌లో కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. వీటితో పాటు హిందీ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సైతం స్ట్రీమింగ్‌కు వచ్చేస్తున్నాయి. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 10కి పైగా సినిమాలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏయే సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.

ఈ శుక్రవారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు

నెట్‌ఫ్లిక్స్

   పవర్ (ఇంగ్లీష్ మూవీ) - మే 17
   ద 8 షో (కొరియన్ సిరీస్) - మే 17
   థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - మే 17    

అమెజాన్ ప్రైమ్

   99 (ఇంగ్లీష్ సిరీస్) - మే 17

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

   బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) - మే 17

జీ5

   బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) - మే  17
   తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) - మే 17

జియో సినిమా

   జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా)  - మే 17

ఆపిల్ ప్లస్ టీవీ

   ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్

   ఎల్లా (హిందీ సినిమా) - మే 17

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement