మలయాళీ బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ చిత్రానికి తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 6న ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఇప్పుడు ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. శనివారం(మే 5) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఈ మూవీ అందుబాటులో ఉంది.
థియేటర్స్‌లో మిస్ అయినవారు ఇప్పుడు ఇంట్లోనే ఈ చిత్రాన్ని చూడొచ్చు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి, జార్జ్ మరియన్, లాల్ జూనియర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకత్వం వహించారు.
ఇదీ మంజుమ్మల్ బాయ్స్ స్టోరీ
ఈ సినిమా కథ 2006 ప్రాంతంలో జరుగుతుంది. కేరళలోని కొచ్చికి చెందిన కుట్టన్(సౌబిన్ షాహిర్), సుభాష్(శీనాథ్ బాసి)తో పాటు మరికొంత మంది స్నేహితులు ఊర్లోనే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటారు. ఈ గ్యాంగ్‌కి మంజుమ్మల్ బాయ్స్ అని పేరు పెట్టుకుంటారు. వీరంతా కలిసి ఓసారి తమిళనాడులోని కొడైకెనాల్ టూర్‌కి వెళ్తారు. అక్కడ అన్ని ప్రదేశాలను చూసి.. చివరకు గుణ కేవ్స్‌కి వెళ్తారు.
అది చాలా ప్రమాదకరమైన గుహ. ఆ గుహల్లో చాలా లోతైన లోయలుంటాయి. వాటిల్లో డెవిల్స్ కిచెన్ ఒకటి. అందులో పడ్డవారు తిరిగిన వచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఆ ఏరియాకు టూరిస్టులు వెళ్లకుండా డెంజర్ బోర్డ్ పెట్టి నిషేధిస్తారు అటవి శాఖ అధికారు. కానీ మంజుమ్మల్ బాయ్స్ అధికారుల కళ్లుగప్పి నిషేధించిన ప్రాంతానికి వెళ్తారు. ఆ గుహంతా తిరిగి తెగ అల్లరి చేస్తారు.
ఇంతలో అకస్మాత్తుగా ఓ లోయలో పడిపోతాడు సుభాస్. ఆ తర్వాత ఏం జరిగింది? సుభాష్‌ని కాపాడటానికి తోటి స్నేహితులు ఏం చేశారు? వారికి పోలీసు శాఖ, ఫైర్ డిపార్ట్‌మెంట్ ఎలాంటి సహాయాన్ని అందించాయి? చివరకు సుభాష్ ప్రాణాలతో బయటకొచ్చాడా లేదా? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment