
ఓ కల ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. తప్పకుండా అందరూ చూసి టీమ్‌ని ఆశీర్వదించండి’’ అని అన్నారు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు. గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఓ కల. దీపక్ కొలిపాక దర్శకత్వం వహిస్తున్న
‘‘ఓ కల ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. తప్పకుండా అందరూ చూసి టీమ్‌ని ఆశీర్వదించండి’’ అని అన్నారు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు. గౌరీశ్ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ఓ కల. దీపక్ కొలిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్టైన్మెంట్, అహం అస్మి ఫిల్మ్స్ బ్యానర్లపై లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి, అదిత్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ కొలిపాక మాట్లాడుతూ.. ‘‘తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన దర్శకధీరుడు రాజమౌళిగారి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల చేశాం. ఆయన ఆశీస్సులు మాకు ఎంతో బలాన్నిచ్చాయి. ఇప్పుడు సక్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజుగారు ట్రైలర్ విడుదల చేసి.. సినిమా విజయవంతం కావాలని ఆశీర్వదించారు. మా టీమ్ తరపున ఆయనకు ధన్యవాదాలు. సినిమా విషయానికి వస్తే.. ఒక మంచి కథని తెలుగు ప్రేక్షకులకు చెప్పే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా ధన్యవాదాలు. ఏప్రిల్ 13 నుంచి హాట్ స్టార్‌లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. తప్పకుండా అందరూ చూసి విజయవంతం చేస్తారని భావిస్తున్నాను’’ అని తెలిపారు.