ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అఫీషియల్‌ ప్రకటన | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలోకి 'నా సామిరంగ'.. అప్పటినుంచే స్ట్రీమింగ్‌..

Published Sat, Feb 10 2024 2:00 PM

Naa Saami Ranga OTT Streaming Date Locked - Sakshi

'నా సామిరంగ' అంటూ  సంక్రాంతి బరిలో దిగి అక్కినేని నాగార్జున హిట్‌ కొట్టారు. విజయ్‌ బిన్ని డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రానికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా ఉన్నారు. ఇందులో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తే అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. 

సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైంధవ్, హనుమాన్‌ వంటి చిత్రాలకు గట్టి పోటీగా నా సామిరంగ చిత్రం నిలిచింది. అంచనాలకు మించి కలెక్షన్స్‌ రాబట్టి నాగ్‌ కెరియర్‌లో మరో హిట్‌ను అందుకున్నారు. నా సామిరంగ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని వెయిట్ చేస్తున్న అభిమానులకు తాజాగా డిస్నీ+హాట్‌స్టార్‌ శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి 17 నుంచి నా సామిరంగ స్ట్రీమింగ్‌  అవుతుందని హాట్‌స్టార్‌ అఫీషియల్‌గా ప్రకటించింది.

'పొరింజు మరియమ్‌ జోస్‌' అనే మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 55 కోట్లకు పైగానే గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఓపెనింగ్స్‌ తొలి మూడు రోజుల్లోనే రూ. 28 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Advertisement
Advertisement