ఈసారి సంక్రాంతి బరిలో నిలిచిన చివరి సినిమా 'నా సామి రంగ' కూడా థియేటర్లలోకి వచ్చేసింది. పూర్తి విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో నాగార్జునతో పాటు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ నటించారు. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ చిత్రంతో డైరెక్టర్ అయ్యాడు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఓటీటీ పార్ట్‌నర్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.
కింగ్ నాగార్జున.. మొన్నటివరకు బిగ్‌బాస్ 7వ సీజన్ హోస్ట్‌గా చేశారు. దీనితోపాటే 'నా సామి రంగ' షూటింగ్ కూడా పూర్తి చేశారు. సెప్టెంబరులో మొదలైన ఈ చిత్రం కేవలం నాలుగు నెలల్లోనే అన్నీ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చేసింది. మరీ సూపర్ కాకపోయినా పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది.
(ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్)
ఇకపోతే బిగ్‌బాస్ హోస్ట్‌గా చేస్తున్న నాగార్జున.. తనకు సదరు ఛానెల్‌తో ఉన్న బాండింగ్ నేపథ్యంలో 'నా సామి రంగ' చిత్రానికి మంచి డీల్ కుదిర్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ దక్కించుకుంది. అలానే 45 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా డీల్ మాట్లాడుకున్నారట.
అయితే సినిమాని ఓటీటీ సంస్థకు అమ్మిన తర్వాత ఎప్పుడు స్ట్రీమింగ్ చేయాలనేది సంస్థ తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే 'నా సామి రంగ' చిత్రాన్ని 30 రోజుల తర్వాత ఓటీటీ రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనిబట్టి చూస్తే ఫిబ్రవరి 3వ వారం లేదంటే మార్చి తొలి వారంలో ఈ సినిమా ఓటీటీలోకి రావొచ్చని అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: Naa Saami Ranga Review: ‘నా సామిరంగ’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment