మాట మీద నిలబడ్డ నాగ్‌! నా సామిరంగకు ఎన్ని కోట్లు వచ్చాయంటే? | Nagarjuna Naa Saami Ranga Movie 3 Days Box Office Collections Details Inside - Sakshi
Sakshi News home page

Naa Saami Ranga Collections: హిట్టు దిశగా నా సామిరంగ.. మూడు రోజుల్లో ఎంతొచ్చిందంటే?

Published Wed, Jan 17 2024 11:32 AM | Last Updated on Wed, Jan 17 2024 11:51 AM

Nagarjuna Naa Saami Ranga Movie 3 Days Collection - Sakshi

మల్టీస్టారర్‌ సినిమాలకున్న క్రేజే వేరు. ఇద్దరు హీరోలు తెరమీద కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటిది ఈ సంక్రాంతికి ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాతో సందడి చేశారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున యువ హీరోలు అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌లతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. ఈ మూవీలో ఆషిక రంగనాథ్‌, మిర్నా మీనన్‌, రుక్సర్‌ ధిల్లాన్‌ హీరోయిన్లుగా నటించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించాడు.

మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
'పొరింజు మరియమ్‌ జోస్‌' అనే మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్‌ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం అని చెప్పిన నాగ్‌ తన మాటను నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్లు (గ్రాస్‌) రాబట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గర్లో..
వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గరగా ఉందని వెల్లడించింది. నాగార్జున జోరు చూస్తుంటే మరో రెండు,మూడు రోజుల్లో బ్రేక్‌ ఈవెన్‌ దాటేసి హిట్‌ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా నాగార్జున.. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ డైరెక్టర్‌ నవీన్‌తో సినిమా చేయనున్నాడు. ‘బ్రహ్మస్త్ర 2’ లోనూ భాగం కానున్నాడు.

చదవండి: హీరోయిన్‌ నుంచి క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, యాంకర్‌గా.. ఈ నెలలో ప్రియుడితో పెళ్లి

whatsapp channel

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement