ఓటీటీకి 'నా సామిరంగా'.. స్ట్రీమింగ్ అప్పుడేనా? | Nagarjuna Naa Saami Ranga Movie Ott Streaming On This Date | Sakshi
Sakshi News home page

Naa Saami Ranga Movie: ఓటీటీకి నాగార్జున 'నా సామిరంగా'.. ఆ డేట్ ఫిక్స్!

Published Tue, Jan 30 2024 4:58 PM | Last Updated on Tue, Jan 30 2024 5:51 PM

Nagarjuna Naa Saami Ranga Movie Ott Streaming On This Date - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి పోటీలో నిలిచిన కింగ్ నాగార్జున నా సామిరంగా చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. పొంగల్‌ బరిలో గుంటూరు కారం, హనుమాన్,సైంధవ్‌ చిత్రాలతో పోటీపడి బ్రేక్ ఈవెన్ సాధించింది. తొలి రోజే రూ.5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం అదే జోరును కొనసాగించింది. ఈ మూవీని మలయాళ చిత్రానికి రీమేక్‌గా విజయ్ బిన్నీ దర్శకత్వంతో తెరకెక్కించారు. 

అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సరిగ్గా నెల రోజుల తర్వతే స్ట్రీమింగ్ కానున్నట్లు లేటెస్ట్ టాక్.

ఈ లెక్కన ఫిబ్రవరి 15 నుంచి స్ట్రీమింగ్‌కు అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించాడు. కాగా.. ఇటీవలే నాసామిరంగా సక్సెస్‌ మీట్‌ కూడా నిర్వహించింది చిత్రబృందం. ఈ ఈవెంట్‌కు సినిమా టీమ్ అంతా హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement