టైటిల్: నాగేంద్రన్స్ హనీమూన్స్
నటీనటులు: సూరజ్ వెంబరమూడు, శ్వేత మీనన్, గ్రేస్ ఆంటోనీ, నిరంజన, అనూప్ తదితరులు
నిర్మాత: నితిన్ రెంజీ పనికర్
దర్శకత్వం: నితిన్ రెంజీ పనికర్
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
నాగేంద్రన్స్ హనీమూన్స్ సిరీస్ పేరు వినగానే ఇదేదో రొమాంటిక్ కథ అనుకుంటాం. కాని ఈ కథలో రొమాన్స్ తో పాటు మంచి కామెడీ కూడా ఉండడం విశేషం. మెల్ల మెల్లగా భారతీయ ఓటీటీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా ఆదరించడం హర్షణీయం. నాగేంద్రన్స్ హనీమూన్ సిరీస్ ఓ మంచి రొమాంటిక్ కామెడీ అని చెప్పవచ్చు. ఓ పెళ్ళి చేసుకోవడానికి వంద అబద్ధాలైనా ఆడవచ్చు అన్న నానుడి వినే ఉంటాం. కాని ఈ కథలోని కథానాయకుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నాడు అన్నదే పాయింట్.
వధువు ఇచ్చే కట్నకానుకలపై కన్నేసిన కథానాయకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడుతూ చివరికి ఏమయ్యాడన్నదే ఈ నాగేంద్రన్స్ హనీమూన్. విలక్షణ మళయాళ నటుడు సూరజ్ వెంజరమూడు నటించిన ఈ సినిమాను నితిన్ రెంజి పానికర్ దర్శకత్వంలో రూపొందించారు. కథ సిరీస్ కాబట్టి స్క్రీన్ ప్లే సరదాగా రాసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా బోర్ ఫీలవకుండా ప్రేక్షకుడు ఎపిసోడ్ స్కిప్ చేయకుండా చూసేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. అక్కడక్కడా కొంత లాగ్ ఉన్నా వెరైటీ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు మంచి వాచబుల్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్.
-ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment