Web Series Review
-
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
Brinda Web Series Review: 'బృంద' వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్: బృందవిడుదల: ఆగష్టు 2 నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ఎపిసోడ్స్: 8స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లాసౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.కథకథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్‌తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్‌తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది. మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్‌కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు. అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్‌ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ. త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్‌గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.ఎలా ఉందంటే..కథ ప్రారంభం 1996 టైమ్‌లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సిరీస్‌ను నడిపించారు. బృంద ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్‌లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్‌గా బృంద ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. -
తనను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది: మెగాస్టార్ ట్వీట్ వైరల్
నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ పరువు. జూన్ 14న ఓటీటీకి వచ్చేసిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.పరువు సీజన్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఓ చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అనే విషయంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ అందించిన సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. నా సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారని చిరంజీవి కొనియాడారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, మిత్ తివారి కీలక పాత్రలు పోషించారు.Congratulations #Paruvu team on the huge success👏. Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content and my dear brother @NagaBabuOffl for a brilliant performance. ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024 -
Buried Truth Review In Telugu: ఇంద్రాణి ముఖర్జీ 'బరీడ్ ట్రూత్'.. ఎలా ఉందంటే?
మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జీ ఆధారంగా వచ్చి డాక్యు సీరిస్ వివాదాలతో పాటు.. చాలా కొత్త విషయాలను తెరమీదకు తెచ్చింది. కూతురు హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఇంద్రాణి చేస్తున్న వాదనకు మద్దతు పలికేలా ఈ సీరిస్ ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సిరీస్ విడుదలను అడ్డుకోవాలని సీబీఐ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో… ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయితో పాటు ఈ కేసును కవర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు అందరి ఇంటర్వ్యూలు ఈ సిరీస్‌లో మనం చూడొచ్చు. పోలిస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న లూప్‌హోల్స్ … లీగల్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఈ క్రైం కథలో బ్లెండ్ అయ్యాయి. హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల అత్యుత్సాహం… మీడియా ట్రయల్లాంటి సున్నితమైన అంశాలను కూడా ఈ సిరీస్ టచ్ చేసింది. బరీడ్ ట్రూత్ సిరీస్‌లో ఇంద్రాణి స్వయంగా తన వాదనను తానే టీవీ స్క్రీన్‌పై చెప్పుకోవడం… ఆడియన్స్‌కు మరింత ఆసక్తిని పెంచింది. 2012లో మాయమైన ఇంద్రాణి కూతురు షీనాబోరా హత్యకు గురైందని మూడేళ్ల తరువాత పోలీసులు గుర్తిస్తారు. అదీ ఓ సాధారణ వెహికిల్ చెకింగ్‌లో భాగంగా అరెస్టైన వ్యక్తి చెప్పిన సమాచారంతో ఈ మొత్తం కథ బయటకు వస్తుంది. కూతురు మూడేళ్ల పాటు కనిపించకుండా పోయినా ఇంద్రాణి ఎందుకు మాట్లాడలేదనే విషయంపై ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. చాలా వరకు నిజమైన క్యారెక్టర్లతోనే స్టోరీ చెప్పే ప్రయత్నం జరిగింది. షీనాబోరాను తన చెల్లెలుగా మూడోభర్త కుటుంబానికి ఎందుకు పరిచయం చేసిందననే విషయంపై ఇంద్రాణి చెప్పిన సీక్రెట్ హైలెట్‌గా ఉంటుంది. తన తండ్రే తన కూతురికి తండ్రి అన్న విషయాన్ని ఇంద్రాణి ఈ సిరీస్‌లో రివీల్ చేస్తుంది. తాను 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కన్న తండ్రి తనను అత్యాచారం చేసిన విషయాన్ని ఇంద్రాణి చెబుతుంది. ఆ తరువాత మళ్లీ మళ్లీ అత్యాచారానికి గురయ్యానని.. తన తండ్రి ద్వారానే తాను తల్లినయ్యానని ఇంద్రాణి రివీల్ చేస్తుంది. షీనాబోరాను దాదాపు 16 ఏళ్ల పాటు దూరంగా ఉంచిన ఇంద్రాణి.. ఆ తరువాత ఎందుకు తన దగ్గరకు తెచ్చుకుంది. మూడో భర్త కొడుకుతో ఇంద్రాణి కూతురు ప్రేమలో పడటం లాంటి చాలా జుగుప్సాకరమైన విషయాలను ఈ సిరీస్‌లో చూపించారు. పీటర్ ముఖర్జీయా కుమారుడు రాహుల్, ఇంద్రాణి కూతురు షీనాబోరా ప్రేమ వల్లే ఈ హత్య జరిగిందనే చర్చ ఉంది. అయితే షీనాబోరా మిస్సయ్యాక రాహుల్ ఏవిధంగా ఆమెను వెతికే ప్రయత్నం చేశాడో ఈ సిరీస్ ద్వారా బయటకు వచ్చింది. పీటర్ ముఖర్జీయాకు షీనా హత్య గురించి తెలుసా? లేదా అనే విషయంపై ఈ సిరీస్‌లో కీలకమైన పాయింట్ రివీల్ చేశారు. షీనాబోరా హత్యకేసుకు సంబంధించి చాలా విషయాలు ఇప్పటికే అందరికీ తెలిసినా.. ఈ సిరీస్‌లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రేక్షకులకు చివరిగా ఒక మాట… కూతురిని హత్య చేసిందనే ఆరోపణలతో 6 ఏళ్లపాటు జైల్లో ఉన్న ఇంద్రాణి… ఈ సిరీస్‌లో కనిపించిన తీరు మైండ్ బ్లోయింగ్. అసలు ఎక్కడా భయం.. పశ్చాత్తాపం లాంటివి లేకుండా హీరోయిన్లా ఇంద్రాణి డైలాగ్స్ చెప్పడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. తన అందం చూసి పార్టీల్లో మగవాళ్లు పిచ్చోళ్లై పోతారని… ఆడవాళ్లు ఇబ్బందిగా ఫీలవుతారని ఇంద్రాణి చెప్పే డైలాగులు ఆమెలోని కాన్ఫిడెన్స్‌ను బయటపెట్టాయి. మూడో పెళ్లి చేసుకున్నా… కన్న పిల్లలను చెల్లెలు, తమ్ముడిగా చెప్పుకున్నా అది తన ఎదుగుదలకే అని ఇంద్రాణి చెప్పిన మాటలు చాలామందికి నచ్చకపోవచ్చు. కాని మీ కూతురుని మీరు హత్య చేశారా? అనే ప్రశ్నకు… ఇంద్రాణి చెప్పిన సమాధానం… ఈ సీరిస్‌లోనే హైలట్‌గా నిలిచింది. -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ
టైటిల్: అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ తదితరులు నిర్మాణ సంస్థ: అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ నిర్మాత: బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్ సంగీతం: అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి బొంతల విడుదల తేదీ: 30 జూన్ 2023 తెలుగులో ఓటీటీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆహా'నే. మిగతా వాటిల్లో తెలుగు సినిమాలు, సిరీసులు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ దీనిలో మాత్రం ప్రతివారం ఓ సినిమా లేదంటే వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తుంటారు. వాటి రిజల్ట్ సంగతి పక్కనబెడితే ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తుంటాయి. అలా ఈసారి 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అనే వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలని హైదరాబాద్‌కి వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్‌గా చేరుతాడు. ఇతడి టీమ్ లీడ్ జై మాత్రం అరుణ్‌ని బానిసలా చూస్తుంటాడు. ఓ పందెం వల్ల అరుణ్.. షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్‌లోకి వచ్చిపడతాడు. కొన్నిరోజుల్లోనే ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఏకంగా ఆమెతో పర్సనల్ రిలేషన్లోకి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పల్లవి(అనన్య) పాత్ర ఏంటి? ఫైనల్‌గా అరుణ్ ఏం తెలుసుకున్నాడు? అనేది 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఎలా ఉందంటే? ఓ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు టీమ్ లీడర్ షాలినీ అందరికీ పార్టీ ఇస్తుంది. అరుణ్ కూడా ఆ పార్టీకి వస్తాడు. డ్రింక్ చేస్తాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత సెల్లార్ లోని కారులో అరుణ్-షాలినీ కాస్త అడ్వాన్స్ అవుతారు. అదే సమయంలో వీళ్లిద్దరిని మరో ఇద్దరు చూస్తారు. అసలు వీళ్లెందుకు కారులో ముద్దుముచ్చట వరకు వెళ్లారు. అరుణ్-షాలినీని చూసిన ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే సిరీస్ చూడండి. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్'.. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్‌కు అధికారిక రీమేక్. ఓటీటీలో ఎపిసోడ్స్ తర్వాత చాలామందికి ఇది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోయారు. అరుణ్ కుమార్ హైదరాబాద్ లో ఓ బ్యాచిలర్ రూమ్‌లో ఉంటాడు. ఉదయమే లేచి ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడేమో టీలు చేసే పని అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వెళ్లారు. కార్పొరేట్ వరల్డ్ లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? పని వల్ల ఎలాంటి సంఘర్షణ అనుభవించాడు? చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేది తొలి సీజన్ లోని ఐదు ఎపిసోడ్లలో చూపించారు. ఇందులో అరుణ్ కుమార్ కి ఓ ట్రాయాంగిల్ లవ్‌స్టోరీ కూడా ఉంటుందండోయ్. ఒక్కో ఎపిసోడ్ 20-25 నిమిషాలే ఉంటుంది. అలా ఆడుతూ పాడుతూ సిరీస్ ని చూసేయొచ్చు. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' లో చెప్పుకోవడానికి పెద్దగా కొత్తగా ఏం లేదు. అలా సాఫ్ట్ గా వెళ్లిపోతూ ఉంటుంది. బాగాలేదు అని చెప్పలేం అలా అని బాగుందని కూడా చెప్పలేం. ఈ సీజన్ అంతా కూడా అరుణ్ కుమార్ చుట్టూనే నడుస్తుంది. అనన్య, తేజస్వి పాత్రలని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా తర్వాత సీజన్లలో వీళ్లకు ప్రాధాన్యం దక్కుతుందేమో? ఎవరెలా చేశారు? అరుణ్ కుమార్ గా నటించిన హర్షిత్ రెడ్డి.. ఇంటర్న్ పాత్రలో సెట్ అయిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, అందరు చెప్పిన పనులు చేస్తూ బాగానే మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగుంది. పల్లవిగా నటించిన అనన్య బాగానే నటించింది. ఈమె పాత్రకి ఇంకాస్త ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది. డామినేషన్, స్వార్థం కలగలిపిన టీమ్ లీడర్ షాలినీ పాత్రలో తేజస్వి ఓకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీకి తగ్గట్లు డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. చాలావరకు ఆఫీస్ లో ఒకే చోట సీన్లన్నీ తెరకెక్కించారు. కాబట్టి పెద్దగా ఖర్చు అయ్యిండకపోవచ్చు. నిర్మాణ విలువులు డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ పర్వాలేదనిపించాడు. సిరీస్ ని ఇంకాస్త ఎమోషనల్ గా తీసుంటే బాగుండేది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలోపే సీన్లన్నీ చకచకా పరుగెడుతుంటాయి! ఈ వీకెండ్ ఏదైనా సిరీస్ తో టైమ్‌పాస్ చేద్దామంటే 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' ట్రై చేయొచ్చు! -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
Jee Karda Review: 'జీ కర్దా' వెబ్ సిరీస్ తెలుగు రివ్యూ
టైటిల్: జీ కర్దా (8 ఎపిసోడ్స్) నటీనటులు: తమన్నా, సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటి, అన్య సింగ్ తదితరులు నిర్మాతలు: దినేష్ విజన్, అశిష్ నిక్రమ్ డైరెక్టర్: అరుణిమ శర్మ సంగీతం: సచిన్-జిగర్ సినిమాటోగ్రఫీ: మహేంద్ర జె శెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్ విడుదల తేదీ: 2023 జూన్ 15 ప్రస్తుతం థియేటర్లలో 'ఆదిపురుష్' హవా నడుస్తోంది. ఓటీటీలో మాత్రం తమన్నా లీడ్ రోల్ లో నటించిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో హద్దులు చెరిపేసి మరీ అవాక్కయ్యే శృంగార సన్నివేశాల్లో తమన్నా కనిపించడమే దీనికి కారణం. దీంతో అందరూ దృష్టి ఈ సిరీస్ పై పడింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 'జీ కర్దా' కథేంటి? లావణ్య (తమన్నా), రిషభ్ (సుహైల్ నయ్యర్), అర్జున్ (అషిమ్ గులాటి), ప్రీత్ (అన్య సింగ్), షీతల్ (సంవేదన), షాహిద్ (హుస్సేన్ దలాల్), మెల్రాయ్ (సయన్ బెనర్జీ) చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడికెళ్లినా, ఏదైనా కలిసే చేస్తుంటారు. ఓ రోజు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే.. ఒక్కొక్కరి గురించి ఆయన ఒక్కో విషయం చెబుతాడు. కానీ ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత రియాలిటీలో అలానే జరుగుతుంది. ఈ ఏడుగురి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు ఏం జరిగింది? అనేదే 'జీ కర్దా' మెయిన్ స్టోరీ. ఎలా ఉందంటే? లావణ్య(తమన్నా) అలియాస్ లవ్ కి తమ గ్యాంగ్ లోని అబ్బాయితోనే పెళ్లి ఫిక్సవుతుంది. చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారని అందరికీ తెలుసు. కానీ సంగీత్ రోజు.. తమ గ్యాంగ్ లోని మరో అబ్బాయితో లావణ్య శృంగారంలో పాల్గొంటుంది. అదీ కూడా బాత్రూమ్ లో. నార్మల్ గా చూస్తే ఇది ఓ బోల్డ్ సీన్. కానీ మొత్తం సిరీస్ ని టర్న్ చేసేది కూడా ఈ సీనే. అరే స్పాయిలర్ చెప్పేశాడే అస్సలు అనుకోవద్దు. ఇలాంటి బోల్డ్ సీన్స్ ఈ సిరీస్ లో ఎపిసోడ్ ఒకటి చొప్పున చాలా ఉన్నాయండోయ్. ఓటటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత డైరెక్టర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. దీంతో బౌండరీ చెరిపేసేలా సినిమాలు/వెబ్ సిరీసులు తీస్తున్నారు. కాకపోతే కొన్నింటిలో బోల్డ్ నెస్ పరిమితులు దాటేస్తోంది. 'మీర్జాపుర్' సిరీస్ అందులో బూతులు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తెలుగులో రిలీజైన 'సైతాన్' కూడా ఇదే బాపతు. ఇప్పుడు వాటితో పోల్చి చెప్పలేం కానీ 'జీ కర్దా' కూడా ఓ రకంగా అలాంటి బోల్డ్ సిరీసే అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) ఏడుగురు ఫ్రెండ్స్ (ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు) ఓ జ్యోతిషుడి దగ్గర జాతకం చెప్పించుకోవడంతో ఫస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడి నుంచి వీళ్ల ప్రస్తుతం, గతాన్ని చూపిస్తూ స్టోరీ సాగుతూ ఉంటుంది. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న లావణ్య.. ఫుడ్ యాప్ లాంచ్ చేయడం కోసం తెగ కష్టపడుతూ ఉండే రిషభ్ తో రిలేషన్ లో ఉంటుంది. పెళ్లికి ముందే ఒకే అపార్ట్ మెంట్ లో కలిసే ఉంటారు కూడా. వీళ్ల మధ్య కోపం, ప్రేమ, సె*క్స్, అలక, కన్నీళ్లు.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే సిరీస్ లో వీళ్లవే లీడ్ రోల్స్. ఈ బ్యాచ్ లో ప్రధాన పాత్రల ద్వారా అర్బన్ కల్చర్ లో ఏమేం జరుగుతుందనేది చూపించారు. సవతి తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యే అబ్బాయి, త్వరలో పెళ్లి చేసుకునే కూతురితో తన బ్రేకప్, రిలేషన్ గురించి డిస్కస్ చేసే తల్లి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే ఓ అమ్మాయి.. రొమాన్స్-సెక్స్ కోసం విషయంలో ఇబ్బందిపడటం, కౌన్సిలర్ గా బాగా పేరు తెచ్చుకున్న ఓ అమ్మాయి.. తన జీవితాన్ని మాత్రం సరిగా ప్లానింగ్ చేసుకోలేకపోవడం, డబ్బుల్లేకపోవడంతో ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు తనని తాను తక్కువగా అనుకోవడం.. ఇలా ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ఎమోషన్ ఉంది. అది మిమ్మల్ని కచ్చితంగా ఆలోచింపజేస్తుంది. ప్రేమ, రొమాన్స్, బ్రేకప్స్, స్వలింగ సంపర్కం లాంటి ఎలిమెంట్స్ జోడించి 'జీ కర్దా' సిరీస్ తీశారు. ఎవరి లైఫ్ అయినా సరే అనుకున్నట్లు అస్సలు ఉండదు అనేదే ఈ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. స్టోరీ పరంగా కొత్తగా ఏం లేకపోయినప్పటికీ.. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్, డ్రామాని డైరెక్టర్ చాలా చక్కగా చూపించారు. ఒక్కో ఎపిసోడ్ అరగంటకు కాస్త అటుఇటుగా ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ని అలా అలా చూసేయొచ్చు. బోల్డ్ కంటెంట్, బూతు డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ఒంటరిగానే చూడండి. ఎవరెలా చేశారు? ఇప్పటివరకు తమన్నా హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది గానీ హద్దులు దాటలేదు. ఈ సిరీస్ లో మాత్రం బూతు డైలాగ్స్, బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. 'రానా నాయుడు'లో వెంకటేష్ పాత్ర చూసినప్పుడు ఎలా సర్ ప్రైజ్ అయ్యారో.. ఇందులో తమన్నాని చూసినప్పుడు సేమ్ అలానే అవుతారు. ఇది మాత్రం గ్యారంటీ. మిగిలిన రోల్స్ చేసిన వాళ్లలో తెలుగోళ్లకు తెలిసిన యాక్టర్స్ ఎవరూ ఉండరు కానీ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ప్రతి సీన్.. సిరీస్ కి ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తోపాటు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇది యూత్ కోసమే తీసిన సిరీస్. ఈ విషయం మాత్రమే దృష్టిలో పెట్టుకుని చూడండి. -చందు, సాక్షి వెబ్ డెస్క్ -
న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎలా ఉందంటే?
వెబ్ సిరీస్: న్యూసెన్స్ నటీనటులు: నవదీప్, బిందుమాధవి, మహిమా శ్రీనివాస్, నంద గోపాల్, చరణ్ కురుగొండ, జ్ఞానేశ్వర్ దర్శకుడు: శ్రీ ప్రవీణ్ కుమార్ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్ నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంగీతం: సురేశ్ బొబ్బిలి ఓటీటీ ప్లాట్‌ఫామ్: ఆహా రిలీజ్ డేట్: మే 12, 2023 మీడియా.. మూడు అక్షరాల పదం. బలవంతుడికి, బలహీనుడికి కావాల్సిన ఆయుధం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి. పక్కన ఉన్న స్నేహితుడిని నమ్మకపోయినా సరే పొద్దున్నే పేపర్లో వచ్చే వార్తను మాత్రం నమ్ముతారు. అంతటి పవర్ పెన్నుకు ఉంది. ఆ కలం కల్పితాలను సృష్టిస్తే, నిజాన్ని కప్పేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తే, పైసా ఉన్నోడికి లొంగిపోయి తప్పులను కప్పిపుచ్చేస్తే.. మీరే దిక్కంటూ మీడియానే నమ్ముకున్న అనామకులను సైతం నయవంచన చేస్తే.. నిజం చాటున నిలబడాల్సిన వాళ్లు ఎందుకలా తయారయ్యారు? వంటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించిన సిరీస్ న్యూసెన్స్. కథ: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి ప్రెస్‌క్లబ్ చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ ఏది రాస్తే అదే నిజం అని జనాలు గుడ్డిగా నమ్ముతుంటారు. సమస్య ఎక్కడుంటే అక్కడ పోలీసుల కన్నా ముందే వాలిపోతారు పాత్రికేయులు. నిజానిజాలు తెలిసినా బలం, బలగం, డబ్బు ఉన్నవాళ్లకు అమ్ముడుపోయి అబద్ధాన్నే ప్రచారం చేస్తారు. వీళ్లకు కావాల్సిందల్లా సాయంత్రానికి పైసల కవర్ వచ్చిందా? లేదా! ఇదే వీళ్లు నేర్చుకున్న, అలవాటు పడిన జర్నలిజం. ఈ ప్రెస్‌క్లబ్‌లో శివ(నవదీప్) ఓ న్యూస్ ఛానల్లో రిపోర్టర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే లోకల్ న్యూస్ ఛానల్లో నీల (బిందు మాధవి) న్యూస్ రీడర్‌గా పని చేస్తుంది. వీరిద్దరి మధ్య చిన్న లవ్ ట్రాక్ ఉంటుంది. ఇకపోతే పోలీసులకు, ప్రభుత్వాధికారులకు చెప్పినా పట్టించుకోని సమస్యను పాత్రికేయులకు చెప్తే న్యాయం దొరుకుతుందని భావిస్తూ ప్రెస్‌క్లబ్ మెట్లెక్కుతారు అమాయక జనాలు. కానీ వారికి అండగా ఉండాల్సింది పోయి బాధలు పెడుతున్న రాబంధులకే సలాం కొడతారు. న్యాయం దొరక్క అమాయకులు ప్రాణాలు పోతున్నా వారి మనసు కరగకపోవడం గమనార్హం. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి మధ్య జర్నలిస్టులు నలిగిపోయే తీరు, ఎవరికి వత్తాసు పలకాలో తెలియని డైలమా, ఇద్దరి దగ్గరా డబ్బులు తీసుకుని సమన్యాయం చేసే నక్క తెలివితేటలు.. ఇలా చాలానే ఉన్నాయి. మధ్యలో హీరో.. పవర్ ఉన్నోడిని ఎదిరించలేక, అరిగోసలు పడ్తున్న అమాయకులకు అండగా ఉండలేక నలిగిపోతుంటాడు. చివర్లో వచ్చిన కొత్త పోలీసాఫీసర్ రాజకీయ నాయకులకు, ప్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. మరి ప్రజల సమస్యలకు చెక్ పడిందా? పోలీసాఫీసర్‌కు, శివకు మధ్య వైరం ఏంటి? రిపోర్టర్స్‌ను రాజకీయ నాయకులు ఎలా వాడుకున్నారు? వంటి విషయాలు తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే! విశ్లేషణ మీడియాపై సినిమాలు రావడం చాలా అరుదు. డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ పాయింట్‌ను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. అయినప్పటికీ కథను తెరకెక్కించడంలో సఫలమయ్యాడు. న్యూసెన్స్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అనవసరమైన సన్నివేశాలు చొప్పించి సాగదీసినట్లుగా అనిపిస్తుంది. రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల మంచి చేయలేని నిస్సహాయుడిగా హీరోను చూపించారు. దీనివల్ల నిరంతరం అతడు సంఘర్షణకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. లోపల మంచితనం ఉన్నా దానికి ముసుగు వేస్తూ బతకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది. చివర్లో అయినా హీరో మారి అన్యాయాన్ని ఎదిరిస్తాడనుకుంటే నిరాశే ఎదురవుతుంది. బహుశా రెండో సీజన్లో అతడి మార్పును చూపిస్తారేమో! మధ్యలో మదర్ సెంటిమెంట్‌ను కూడా వాడారు. ఈ సీన్ మాత్రం హైలైట్ ఓ పేద రైతు కష్టపడి సాగు చేస్తున్న భూమిని ఓ రాజకీయ నాయకుడి మనుషులు కబ్జా చేస్తారు. ఎక్కడా న్యాయం దొరక్క జరల్నిస్టుల దగ్గరకు వస్తారు. వాళ్లు అతడికి సాయం చేస్తామని మాయమాటలు చెప్పి రైతును అడ్డుపెట్టుకుని వారి సొంత పనులు చేసుకుంటారు. నిజం తెలిసిన రైతు చివరకు తెగించి తనే భూమిని కాపాడుకోవాలని పొలానికి వెళ్తాడు. అక్కడున్న రౌడీలు అతడిని అదే భూమిలో చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు రాయిస్తారు. ఈ సీన్ వల్ల జర్నలిస్టులు ఇంత రాక్షసంగా ఉంటారా అనిపిస్తుంది. మరో సంఘటనలో ఓ మహిళ భర్తను పొలిటీషియనే హత్య చేయిస్తాడు. కానీ ఆమె అక్రమ సంబంధం వల్లే అతడు చనిపోయాడంటూ వార్త రాస్తారు. ఈ సీన్లో పాత్రికేయులు మరీ ఇంత నీచానికి దిగజారతారా? అనిపించక మానదు. న్యూస్ రాస్తే రూ.200, రాయకుంటే రెండు వేలు అన్న డైలాగ్ నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. బలవంతుడికి చేతులెక్కి మొక్కాలే కానీ రాళ్లు విసరకూడదు అన్న మాట నాయకులకు వ్యతిరేకంగా ఏమీ చేయలేమన్న చేతకానితనాన్ని చూపిస్తుంది. న్యూస్ రాసేవాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది అన్న డైలాగ్ ముమ్మాటికీ నిజం. సిరీస్ అంతా ఓకే కానీ క్లైమాక్స్ మాత్రం అస్సలు రుచించదు. రెండో సీజన్ ఉంటుందని హైప్ క్రియేట్ చేయాలనుకున్నారు. అక్కడిదాకా బాగానే ఉంది కానీ క్లైమాక్స్ ఓ అర్థంపర్థం లేకుండా గాలికొదిలేనిట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌ను సగంలోనే వదిలేసినట్లుగా ఉంటుంది. ఎలా నటించారంటే? నవదీప్ ఆకలి మీదున్న సింహంలా కనిపించాడు. చిత్తూరు యాసలో డైలాగ్స్ అదరగొట్టేశాడు. నిజానికి, అబద్ధానికి మధ్య నలిగిపోయే సన్నివేశాల్లో బాగా నటించాడు. బిందుమాధవి హీరో ప్రేయసి పాత్రగా అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సిరీస్‌లో నటనపరంగా తనకు పెద్దగా స్కోప్ లభించలేదు. తిక్కలోడిగా కనిపించే పోలీసాఫీసర్ ఎడ్విన్ పాత్రలో నందగోపాల్ నటనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు. ఆయన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాకే సిరీస్‌కు ఓ ఎనర్జీ వచ్చింది. మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. సురేశ్ బెబ్బులి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. అనంతనాగ్ కావూరి, ప్రసన్న, వేదరామన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. సింగిల్ లైన్లో చెప్పాలంటే.. న్యూసెన్స్‌ను న్యూస్‌గా రాస్తారు, కానీ ఇక్కడ న్యూసే న్యూసెన్స్ అయింది! -
‘అహ నా పెళ్లంట’ వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్ టైటిల్ : అహ నా పెళ్ళంట (8 ఎపిసోడ్స్) నటీనటులు : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, దీపాలి శర్మ, మధునందన్, కృతిక సింగ్, 'గెటప్' శ్రీను, భద్రమ్, తదితరులు నిర్మాతలు: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి దర్శకత్వం: సంజీవ్ రెడ్డి సంగీతం : జుడా శాండీ నేపథ్య సంగీతం: పవన్ సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ ఎడిటర్: మధు రెడ్డి విడుదల తేది: నవంబర్ 17, 2022(జీ5) కెరీర్ బిగినింగ్‌లోనే హ్యాట్రిక్ విజయాలు అందుకొని టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. అయితే ఈ యంగ్ హీరోకి ఈ మధ్య బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆయన నటించిన సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోతున్నాయి. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు. ఆయన నటించిన తొలి వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’. శివానీ రాజశేఖర్ హీరోయిన్. నేటి(నవంబర్ 17) నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి రాజ్ తరుణ్ నటించిన తొలి వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘అహ నా పెళ్లంట’ కథేంటంటే.. నారాయణ అలియాస్ నో బాల్ నారాయణ( హర్ష వర్ధన్), సుశీల(ఆమని) దంపతులు ముద్దుల కొడుకు శ్రీను (రాజ్ తరుణ్). చాలా అల్లరిగా ఉండే శ్రీను.. చిన్నప్పుడు స్కూల్లో జరిగిన ఓ సంఘటన కారణంగా ఇకపై అమ్మాయిలతో మాట్లాడనని, వాళ్లని కన్నెత్తి కూడా చూడనని తల్లి సుశీలకు ప్రామిస్ చేస్తాడు. చెప్పినట్లే శ్రీను అమ్మాయిల జోలికి వెళ్లడు. చూడ చూడక ఒక అమ్మాయిని చూస్తే.. ఆ రోజు నాన్న నారాయణకు ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. దీంతో శ్రీను తను అమ్మాయిలను చూడడం వల్లే నాన్నకు ప్రమాదాలు జరుగుతున్నాయని, పెళ్లి చేసుకుంటే ఇవేవి ఉండవని భావిస్తాడు. తనకు పెళ్లి చేయమని అమ్మానాన్నలను అడుగుతాడు. వారు చూసిన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. సరిగ్గా పెళ్లి రోజు ఆ అమ్మాయి ‘ప్రేమించిన అబ్బాయితో లేచిపోతున్నాను’అని లేఖ రాసి పారిపోతుంది. పీటలు వరకు వచ్చిన పెళ్లి ఆగడంతో శ్రీనుతో పాటు కుటుంబ సభ్యులు చాలా బాధపడతారు. తన పెళ్లి ఆగడానికి కారణం మహా(శివానీ రాజశేఖర్) అని శ్రీను తెలుసుకుంటాడు. తన కుటుంబం లాగే ఆమె ఫ్యామిలీ కూడా బాధపడాలని పెళ్లికి ఒక్కరోజు ముందు మహాను కిడ్నాప్ చేస్తాడు. అసలు శ్రీను పెళ్లి ఆగిపోవడానికి మహా ఎలా కారణమైంది? కిడ్నాప్ తర్వాత శ్రీను, మహా కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండడానికి కారణమేంటి? మహా ప్యామికీ వచ్చిన ఓ సమస్యను శ్రీను ఎలా పరిష్కరించాడు? ఇద్దరు ఎలా ప్రేమలో పడ్డారు? తనను కిడ్నాప్ చేసింది శ్రీనునే అని మహాకు ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత మహా తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే వరుసగా ఎనిమిది ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'అహ నా పెళ్ళంట' ఓ రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్. పెళ్లి పీటల దగ్గరు వరుడిని వదిలేసి తన ప్రియుడితో పారిపోయిన ఓ వధువు కథ ఇది. వరుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకోవడంతో కథ ముందుకు సాగుతుంది. వెబ్ సిరీస్‌లా కాకుండా సినిమాలా కథనం సాగుతుంది. దీనికి కారణం దర్శకుడు సంజీవ్ రెడ్డి టేకింగ్ అనే చెప్పాలి. వెబ్ సిరీసే అయినప్పటికీ.. సినిమాలోలాగా పాటలు, కామెడీ, రొమాన్స్..అన్ని ఉండేలా జాగ్రత్త పడ్డాడు. తొలి ఎపిసోడ్ నిడివి ఎక్కువైనప్పటికీ సరదాగా సాగుతుంది. పాటలు, కామెడీ సీన్స్ ఆకట్టుకుంటాయి. రెండో ఎపిసోడ్ కాస్త నెమ్మగా, రొటీన్‌గా సాగుతుంది. మహా కిడ్నాప్‌తో మూడో ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. కిడ్నాప్ సమయంలో, ఆతర్వాత వచ్చే కామెడీ సీన్స్ నవ్విస్తాయి. నాలుగో ఎపిసోడ్ రొటీన్‌గా సాగినప్పటికీ.. శ్రీను, మహా ఒకే ఫ్లాట్‌లోకి రావడంతో ఆసక్తి పెరుగుతుంది. ఐదో ఎపిసోడ్ కూడా కామెడీగానే సాగుతుంది. ఆరో ఎపిసోడ్ నుంచి కథ ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. మహా ఫ్యామిలీకి వచ్చిన సమస్యను తీర్చాలని శ్రీను నిర్ణయించుకోవడం.. ఆ తర్వాత మహా ఇంటికి వెళ్లిపోవడం.. శ్రీనుతో ప్రేమలో పడడం ఇలా ఎమోషనల్‌గా మిగతా ఎపిసోడ్స్ సాగుతాయి. క్లైమాక్స్ కూడా కాస్త డిఫరెంట్‌గా, చాలా రిచ్‌గా తెరకెక్కించారు. ప్రేమ, ద్రోహం, స్నేహం వంటి అనేక భావావేశాలు ఈ సిరీస్‌లో ఉంటాయి. రొటీన్ స్టోరీనే అయినా.. ఫ్రెష్‌గా, ఎలాంటి అశ్లీలత లేకుండా ఈ వెబ్సిరీస్ని తెరకెక్కించాడు సంజీవ్ రెడ్డి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్‌ని ఎంచుకొని, తెరపై అనుకున్న విధంగా చూపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. శ్రీను పాత్రలో రాజ్ తరుణ్ ఒదిగిపోయాడు. తనదైన శైలీలో కామెడీ పండించాడు. మహా పాత్రకు శివానీ రాజశేఖర్ న్యాయం చేసింది. ఆమె పాత్ర కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. రాజ్‌తరుణ్, శివానీ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. హీరో తల్లిదండ్రులుగా ఆమని, హర్షవర్ధన్ బాగా నటించారు. రాజ్ తరుణ్ స్నేహితులుగా రవి శివతేజ, త్రిశూల్ జీతూరి బాగానే నవ్వించారు. పెళ్లికి ముందు లేచిపోయిన అమ్మాయిగా దీపాలి శర్మ, హీరోతో పెళ్లికి ఓకే చెప్పిన అమ్మాయిగా కృతికా సింగ్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. పెళ్లిళ్ల పేరయ్యగా భద్రమ్, సీఐగా రఘు కారుమంచితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీల సినిమాటోగ్రఫీ నీట్‌గా ఉంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి, వెబ్‌డెస్క్