JEE KARDA Review And Rating Telugu - Sakshi
Sakshi News home page

Jee Karda Review: రెచ్చిపోయిన తమన్నా.. ఈ సిరీస్ ఎలా ఉందంటే?

Published Fri, Jun 16 2023 1:18 PM | Last Updated on Fri, Jun 16 2023 2:19 PM

JEE KARDA Review And Rating Telugu - Sakshi

టైటిల్: జీ కర్దా (8 ఎపిసోడ్స్)
నటీనటులు: తమన్నా, సుహైల్ నయ్యర్, ఆషిమ్ గులాటి, అన్య సింగ్ తదితరులు
నిర్మాతలు: దినేష్ విజన్, అశిష్ నిక్రమ్
డైరెక్టర్: అరుణిమ శర్మ
సంగీతం: సచిన్-జిగర్
సినిమాటోగ్రఫీ: మహేంద్ర జె శెట్టి
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్: అమెజాన్ ప్రైమ్
విడుదల తేదీ: 2023 జూన్ 15

ప్రస్తుతం థియేటర్లలో 'ఆదిపురుష్' హవా నడుస్తోంది. ఓటీటీలో మాత్రం తమన్నా లీడ్ రోల్ లో నటించిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో హద్దులు చెరిపేసి మరీ అవాక్కయ్యే శృంగార సన్నివేశాల‍్లో తమన్నా కనిపించడమే దీనికి కారణం. దీంతో అందరూ దృష్టి ఈ సిరీస్ పై పడింది. అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనూ అందుబాటులో ఉన్న ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 

'జీ కర్దా' కథేంటి?

లావణ్య (తమన్నా), రిషభ్ (సుహైల్ నయ్యర్), అర్జున్ (అషిమ్ గులాటి), ప్రీత్ (అన్య సింగ్), షీతల్ (సంవేదన), షాహిద్ (హుస్సేన్ దలాల్), మెల్రాయ్ (సయన్ బెనర్జీ) చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్. ఎక్కడికెళ్లినా, ఏదైనా కలిసే చేస్తుంటారు. ఓ రోజు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే.. ఒక‍్కొక్కరి గురించి ఆయన ఒక్కో విషయం చెబుతాడు. కానీ ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ పెరిగి పెద్దయిన తర్వాత రియాలిటీలో అలానే జరుగుతుంది. ఈ ఏడుగురి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు ఏం జరిగింది? అనేదే 'జీ కర్దా' మెయిన్ స్టోరీ.

ఎలా ఉందంటే?

లావణ్య(తమన్నా) అలియాస్ లవ్ కి తమ గ్యాంగ్ లోని అబ్బాయితోనే పెళ్లి ఫిక్సవుతుంది. చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉన్న వీళ్లిద్దరూ మ్యారేజ్ చేసుకుంటారని అందరికీ తెలుసు. కానీ సంగీత్ రోజు.. తమ గ్యాంగ్ లోని మరో అబ్బాయితో లావణ్య శృంగారంలో పాల్గొంటుంది. అదీ కూడా బాత్రూమ్ లో. నార్మల్ గా చూస్తే ఇది ఓ బోల్డ్ సీన్. కానీ మొత్తం సిరీస్ ని టర్న్ చేసేది కూడా ఈ సీనే. అరే స్పాయిలర్ చెప్పేశాడే అస్సలు అనుకోవద్దు. ఇలాంటి బోల్డ్ సీన్స్ ఈ సిరీస్ లో ఎపిసోడ్ ఒకటి చొప‍్పున చాలా ఉన్నాయండోయ్.

ఓటటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత డైరెక్టర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ దొరికింది. దీంతో బౌండరీ చెరిపేసేలా సినిమాలు/వెబ్ సిరీసులు తీస్తున్నారు. కాకపోతే కొన్నింటిలో బోల్డ్ నెస్ పరిమితులు దాటేస్తోంది. 'మీర్జాపుర్' సిరీస్ అందులో బూతులు గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా తెలుగులో రిలీజైన 'సైతాన్' కూడా ఇదే బాపతు. ఇప్పుడు వాటితో పోల్చి చెప్పలేం కానీ 'జీ కర్దా' కూడా ఓ రకంగా అలాంటి బోల్డ్ సిరీసే అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్‌’ మూవీ రివ్యూ)

ఏడుగురు ఫ్రెండ్స్ (ముగ్గురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు) ఓ జ్యోతిషుడి దగ్గర జాతకం చెప్పించుకోవడంతో ఫస్ట్ ఎపిసోడ్ మొదలవుతుంది. అక్కడి నుంచి వీళ్ల ప్రస్తుతం, గతాన్ని చూపిస్తూ స్టోరీ సాగుతూ ఉంటుంది. ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న లావణ్య.. ఫుడ్ యాప్ లాంచ్ చేయడం కోసం తెగ కష్టపడుతూ ఉండే రిషభ్ తో రిలేషన్ లో ఉంటుంది. పెళ్లికి ముందే ఒకే అపార్ట్ మెంట్ లో కలిసే ఉంటారు కూడా. వీళ్ల మధ్య కోపం, ప్రేమ, సె*క్స్, అలక, కన్నీళ‍్లు.. ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఓ విధంగా చెప్పాలంటే సిరీస్ లో వీళ్లవే లీడ్ రోల్స్.

ఈ బ్యాచ్ లో ప్రధాన పాత్రల ద్వారా అర్బన్ కల్చర్ లో ఏమేం జరుగుతుందనేది చూపించారు. సవతి తండ్రి చేతిలో లైంగిక వేధింపులకు గురయ్యే అబ్బాయి, త్వరలో పెళ్లి చేసుకునే కూతురితో తన బ్రేకప్, రిలేషన్ గురించి డిస్కస్ చేసే తల్లి, మిడిల్ క‍్లాస్ ఫ్యామిలీలో ఉండే ఓ అమ్మాయి.. రొమాన్స్-సెక్స్ కోసం విషయంలో ఇబ్బందిపడటం, కౌన్సిలర్ గా బాగా పేరు తెచ్చుకున్న ఓ అమ్మాయి.. తన జీవితాన్ని మాత్రం సరిగా ప్లానింగ్ చేసుకోలేకపోవడం, డబ్బుల్లేకపోవడంతో ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు తనని తాను తక్కువగా అనుకోవడం.. ఇలా ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో ఎమోషన్ ఉంది. అది మిమ్మల్ని కచ్చితంగా ఆలోచింపజేస్తుంది.

ప్రేమ, రొమాన్స్, బ్రేకప్స్, స్వలింగ సంపర్కం లాంటి ఎలిమెంట్స్ జోడించి 'జీ కర్దా' సిరీస్ తీశారు. ఎవరి లైఫ్ అయినా సరే అనుకున్నట్లు అస్సలు ఉండదు అనేదే ఈ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. స్టోరీ పరంగా కొత్తగా ఏం లేకపోయినప్పటికీ.. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్, డ్రామాని డైరెక్టర్ చాలా చక్కగా చూపించారు. ఒక్కో ఎపిసోడ్ అరగంటకు కాస్త అటుఇటుగా ఉంటుంది. మొత్తం 8 ఎపిసోడ్స్ ని అలా అలా చూసేయొచ్చు. బోల్డ్ కంటెంట్, బూతు డైలాగ్స్ ఉంటాయి కాబట్టి ఒంటరిగానే చూడండి.

ఎవరెలా చేశారు?

ఇప్పటివరకు తమన్నా హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది గానీ హద్దులు దాటలేదు. ఈ సిరీస్ లో మాత్రం బూతు డైలాగ్స్, బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయింది. 'రానా నాయుడు'లో వెంకటేష్ పాత్ర చూసినప్పుడు ఎలా సర్ ప్రైజ్ అయ్యారో.. ఇందులో తమన్నాని చూసినప్పుడు సేమ్ అలానే అవుతారు. ఇది మాత్రం గ్యారంటీ. మిగిలిన రోల్స్ చేసిన వాళ్లలో తెలుగోళ్లకు తెలిసిన యాక్టర్స్ ఎవరూ ఉండరు కానీ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. ప్రతి సీన్.. సిరీస్ కి ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ డిపార్ట్ మెంట్ తోపాటు నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇది యూత్ కోసమే తీసిన సిరీస్. ఈ విషయం మాత‍్రమే దృష్టిలో పెట్టుకుని చూడండి.

-చందు, సాక్షి వెబ్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement