Misunderstanding
-
అవసరమైతే అమిత్ షాతో మాట్లాడుతాం
కోల్‌కతా: బంగ్లాదేశ్ జలాల్లోకి అక్రమంగా వెళ్లినందుకు గురువారం అరెస్టయిన భారతీయ మత్స్యకారుడిని నిబంధనల ప్రకారం విడుదల చేస్తామని బంగ్లాదేశ్ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇటీవల ఒక బీఎస్ఎఫ్ జవాన్‌ను ఓ బంగ్లాదేశీ సరిహద్దు భద్రతా బలగాలు తుపాకీతో కాల్చిచంపడం ద్వైపాక్షిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపబోదని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. అవసరమైతే దీనిపై తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడుతానని వెల్లడించారు. ‘బలగాల మధ్య సమన్వయలోపం కారణంగానే సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) కానిస్టేబుల్ విజయ్ సింగ్ మరణానికి దారి తీశాయి’ అని అసదుజ్జమాన్ చెప్పారు. -
అతడు ‘బాయ్ ఫ్రెండ్’ మాత్రమే: ఫాల్క్‌నర్
మెల్బోర్న్: తాను స్వలింగ సంపర్కుడిని కాదని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్క్‌నర్ వివరణ ఇచ్చాడు. సోమవారం తన 29వ పుట్టిన రోజు సందర్భంగా తల్లి రోస్లిన్ ఫాల్క్‌నర్‌తో పాటు రాబర్ట్ జబ్ అనే యువకుడితో కలిసి ఫాల్క్‌నర్ డిన్నర్ పార్టీలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ‘బాయ్ ఫ్రెండ్‌తో’ డిన్నర్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో అతడు ‘గే’ అంటూ వార్తలు వచ్చాయి. మంగళవారం ఫాల్క్‌నర్ వీటిని ఖండించాడు. రాబర్ట్ జబ్ స్నేహితుడని, ఐదేళ్లుగా ఒకే గదిలో ఉంటున్నామని స్పష్టం చేశాడు. దీనిపై తాము కూడా పొరపాటు పడ్డామని, ఫాల్క్‌నర్‌ను క్షమాపణలు కోరుతున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా పేర్కొనడం గమనార్హం. -
మనస్పర్థలతో ప్రేమికుల ఆత్మహత్య
శంకర్పల్లి: క్షణికావేశం రెండు నిండు జీవితాలను బలిగొంది. మనస్పర్థలు ప్రేమజంట బలవన్మరణాలకు కారణమయ్యాయి. వివరాలు... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూర్‌కు చెందిన సురగళ్ల సత్తయ్య, ప్రకాశం కుటుంబాలు పక్కపక్కనే నివసిస్తున్నాయి. సత్తయ్య కుమారుడు ఎల్లేశ్(22) ఇంటర్ వరకు చదువుకుని గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో సెక్యురిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రకాశం కూతురు లావణ్య(19) పదో తరగతి వరకు చదువుకుని ఇంటి దగ్గరే ఉంటోంది. ఎల్లేశ్, లావణ్య వరు సకు బావ మరదళ్లు. వీరు చాలారోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల్లో ఎవరికీ తెలియదు. కాగా, గ్రామంలో ఆదివారం రాత్రి స్నేహితులతో సరదాగా గడుపుతూ మధ్యలో లావణ్యకు ఫోన్ చేశాడు. ఏదో విషయమై ఇద్దరూ ఫోన్లో గొడవపడ్డారు. ఆమె ఫోన్ కట్ చేయడంతో ఎల్లేశ్ ఆవేశంగా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతోనూ గొడవ పడ్డాడు. బయటకు వచ్చి కొంతమందికి ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, బతకడం ఇష్టం లేదని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకొన్నాడు. విషయం తెలుసుకున్న లావణ్య ఇంట్లోకి వెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మనస్పర్థల వల్లే ప్రేమికులిద్దరు క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. సోమవారం ఇరు కుటుంబాలు వేర్వేరుగా అంత్యక్రియలు నిర్వహించాయి. -
సూదిగాడి కలకలం వట్టిదే
►మానవత్వం చూపబోతే అపార్థం చేసుకున్న స్థానికులు ►పాపకు వైద్యపరీక్షల్లో సూది గుచ్చిన అనవాళ్లు లేవని వెల్లడి బంజారాహిల్స్: హైదరాబాద్ బంజారాహిల్స్‌రోడ్ నెం. 2 లోని ఇందిరానగర్‌లో సూది కలకలం అంతా వట్టిదేనని తేలింది. సూదితో ఆడుకుంటున్న పాపకు అది పొరపాటున గుచ్చుకుంటుందోనని స్థానిక యువకుడు సురేశ్ మానవత్వం చూపితే, అది తప్పుగా అర్థం చేసుకున్న స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తర్వాత పాపకు వైద్య పరీక్షలు చేస్తే సూదిగుచ్చిన అనవాళ్లు లేవని నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. పాపకు సూది గుచ్చుకుంటే ఏమైనా జరుగుతుందని సాయం చేయబోయిన నా స్నేహితుడినే సూది అనుమానితుడిగా చిత్రీకరిచడం బాధాకరమని అతడి రూమ్మేట్ అన్నారు. సురేశ్‌తో పాటు తనను ఈ కేసులో విచారించేందుకు తీసుకుపోతే, ఇంకా పాపకు సూది గుచ్చిందన్న విషయం రూఢి కాకముందే ఫొటోలు తీసి మీడియాలో చూపించడం వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జరిగింది ఇదీ... ఇందిరానగర్ పోచమ్మ దేవాలయం సమీపంలో ఉదయం 11.15 నుంచి 11.30 గంటల మధ్య పాండురంగరావు, శ్రావణి దంపతుల కుమార్తె గ్రేసీ కావ్య (9) ఆడుకుంటోంది. అదే సమయంలో ఆ పాప సూదితో ఆడుకోవడాన్ని గమనించిన సురేశ్.. ఆ సూది గుచ్చుకుంటుందని తీసి పారేశాడు. తర్వాత వారి తల్లికి చెప్పగా, పాపకు సూది ఏమైనా గుచ్చుకుందన్న భయంతో ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఇంతలో చుట్టుపక్కలవాళ్లు సూది సైకో అనుకుని చుట్టుముట్టారు. విషయం ఎంత చెప్పినా వినిపించుకోకుండా సురేశ్‌పై చెయ్యి చేసుకున్నారు. ఇంతలోనే సురేశ్ తన రూమ్మేట్కు కాల్ చేశాడు. ఘటనాస్థలికి చేరుకున్న అతను వారందరినీ విడదీశాడు. గత నాలుగేళ్ల నుంచి ఇందిరానగర్‌లోనే అద్దెకు ఉంటున్నామని, అవసరమైతే యజమానిని వివరాలు అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఇంతలోనే పోలీసులు వచ్చి సురేశ్‌తో పాటు అతడి స్నేహితుడిని తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత పోలీసులు వారిని విచారించగా... ల్యాప్‌టాప్ మాత్రమే లభ్యమైంది. మరే ఇతర అనుమానిత సామగ్రి వారి గదిలో దొరకలేదు. దీంతో సురేశ్ స్నేహితుడిని పోలీసులు వదిలేశారు. కాగా, పాపకు నీలోఫర్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయగా, ఎటువంటి సూది గుచ్చిన ఆనవాళ్లు లేవని తేలింది. అందుకే ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, కేవలం అదుపులోకి తీసుకొని విచారించామని చెబుతున్నారు. ఫొటో పొరపాటు సాక్షి దినపత్రిక మెయిన్ ఐదో పేజీలో సోమవారం ప్రచురించిన బంజారాహిల్స్ సూదిగాడి కలకలం కథనంలో ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని సురేశ్ స్నేహితుడి ఫొటో ప్రచురితమైంది. సురేశ్‌తో పాటు అతడి రూమ్మేట్ను పోలీసు వాహనంలో తరలిస్తుండగా తీసిన ఫొటోలో...సురేశ్ ఫొటోకు బదులుగా అతడి స్నేహితుడి ఫొటో పొరపాటున ప్రచురితమైంది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. -
అలా జరిగిందన్నమాట!
హాస్యం భర్త రమేష్: ప్రియా, రేపటి నుంచి యోగా క్లాసులకు వెళ్లాలనుకుంటున్నాను. నువ్వూ వస్తావా? భార్య ప్రియ: అంటే మీ ఉద్దేశం...నేను లావై పోయాననే కదా! అంటే మీరేదో సన్నగా ఉన్నట్లు... నేనేదో లావుగా ఉన్నట్లు... భర్త: ఈ మాత్రం దానికే కోపం తెచ్చుకుంటే ఎలా? వస్తే వచ్చేయ్ లేకుంటే లేదు. భార్య: అంటే... రావడం రాకపోవడం అనేదాంట్లో నా ప్రమేయం ఏమీ లేదన్నమాట. మీరు రమ్మంటే వచ్చేయాలి. లేదంటే ఇంట్లో కూర్చోవాలా? భర్త: ప్రతిదానికీ అపార్థం చేసుకుంటే ఎలా? భార్య: అంటే నేనేదో అపార్థం చేసుకోవడానికే పుట్టినట్లు, మీరేదో యోగా చేయడానికి పుట్టినట్లు... భర్త: బుద్ధి తక్కువై యోగాకు వెళ్లాలనుకున్నాను. ఇక ఈ జన్మలో వెళ్లను. భార్య: అంటే నేనేదో మిమ్మల్ని హింసించి.... భర్త... పరుగో పరుగు!