
...ఫ్రమ్ బాలీవుడ్!
‘వెరీ గుడ్’ – ఇలాంటి కాంప్లిమెంట్స్ కమ్ తమ టాలెంట్ కేవలం టాలీవుడ్డుకు మాత్రమే పరిమితమైతే ఎలా? బాలీవుడ్డులో కూడా ‘వెరీ గుడ్డు’ అన్పించుకోవాలనే స్టార్స్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్ బోల్డంత మంది మనకు కన్పిస్తారు. బట్, ఫర్ ఏ ఛేంజ్... ఓ బాలీవుడ్ డైరెక్టర్ టాలీవుడ్డుకు వస్తున్నారు. ఆయనే కునాల్ కోహ్లి.
ఆమిర్‌ఖాన్ ‘ఫనా’, సైఫ్ అలీఖాన్ ‘హమ్ తుమ్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిందీయనే. ఇప్పుడు తెలుగులో సందీప్ కిషన్, తమన్నా జంటగా ఓ రొమాంటిక్ కామెడీను తెరకెక్కించాలని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్, తమన్నాలు స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ జూన్ మొదటివారంలో మొదలవుతుందని సమాచారం.