
వాస్తవ సంఘటన ఆధారంగా...
హైదరాబాద్‌లో 1957లో జరిగిన వాస్తవ సంఘటన నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘వసుదైక 1957’. బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేష్, అదుర్స్ రఘు, షాని, బేబి యోధ ముఖ్య పాత్రధారులు. బాల దర్శకత్వంలో అరుణ సమర్పణలో నిడమలూరి శ్రీనివాసులు నిర్మించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఐదేళ్ల పాప జీవితంలో 1957లో జరిగిన ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. సస్పెన్స్, సెంటిమెంట్, కామెడీ, రొమాన్స్ అన్నీ సమపాళ్లలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ నెలాఖరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత శ్రీనివాసులు తెలిపారు.