నువ్వు స్కూటర్‌లాంటోడివి! | fun to father and sun | Sakshi
Sakshi News home page

నువ్వు స్కూటర్‌లాంటోడివి!

Published Tue, Jan 27 2015 11:10 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

నువ్వు స్కూటర్‌లాంటోడివి! - Sakshi

నువ్వు స్కూటర్‌లాంటోడివి!

 హాస్యం
 
కొడుకు చేసే తిక్కపనులను తట్టుకోలేని తండ్రి ఆగ్రహంతో చెంపలు వాయించాడు. కానీ ఆ తరువాత బాధ పడి కొడుకుకు ‘సారీ’ చెప్పాడు.  కొడుకు (కోపంగా): ఒక పేపర్‌ను ఎలా పడితే అలా చించండి. ఆ తరువాత ‘సారీ... నేను ఇలా చేసి ఉండాల్సింది  కాదు. మళ్లీ అతుక్కోండి... యధావిదిగా ఉండండి’ అని పేపర్‌కు చెబితే అతుక్కుంటుందా?  నేను కూడా అంతే. మీ ‘సారీ’ నాకు అక్కర్లేదు.
 తండ్రి: నువ్వు  చెప్పింది కూడా నిజమే అనుకో. అయితే నేను చెప్పింది కూడా విను.

సపోజ్...నా డొక్కు స్కూటర్‌ను ‘స్టార్ట్ కావాలి’ అని చెబితే వింటుందా? 3-4 కిక్కులు ఇస్తేగానీ స్టార్ట్ కాదు. కాబట్టి...నువ్వు పేపర్‌లాంటోటివి కాదు...స్కూటర్‌లాంటోడివి! ఒక్కరే...  పెళ్లికాని కొడుకు: నాన్న నాకు పెళ్లి చేయవద్దు. అమ్మాయిలంటే  నాకు తెగ భయం! నాన్న: చేసుకో నాయినా. అప్పుడు నీకు ఒక్కరు తప్ప అందరూ మంచివాళ్లలాగే అనిపిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement