
తెలుగువారికి వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సంతోషంగా ఈ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
గురువారం కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ట్విట్టర్లో తెలుగు ప్రజలకు ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. 'మనం మన విధులను నిస్వార్థంగా, నిబద్ధతగా చేయాలని గీత భగవానుడు(కృష్ణుడు) సూచించారు. హ్యాపీ కృష్ణాష్టమి' అంటూ ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
The Lord of Gita beckons us to perform our duties with selflessness and commitment. Happy Krishnashtami.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 25 August 2016