
గోకులకృష్ణా.. గోపాలకృష్ణా..
కృష్ణాష్టమి సందర్భంగా చిన్నికృష్ణులు సోమవారం నగరంలో సందడి చేశారు. వివిధ పాఠశాలల్లో విద్యార్థులు ఆకట్టుకునే వేషధారణతో
అలరించారు. ఉట్టికొట్టే కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థినుల నృత్యం మైమరిపించింది. బుడి బుడి అడుగులతో
బాల గోపాలురు అలరించారు. –సిటీబ్యూరో