
పరశురామ్
గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న సంస్థలో వరుసగా మూడు సినిమాలు చేసే చాన్స్ ఒక దర్శకుడికి దక్కడం అంటే చిన్న విషయం కాదు. దర్శక–నిర్మాతల మధ్య వేవ్‌లెంగ్త్ కుదిరితేనే అది సాధ్యమవుతుంది. ఆ విధంగా దర్శకుడు పరశురామ్‌కి, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌తో మంచి అనుబంధం కుదిరింది. అందుకే ‘శ్రీరస్తు–శుభమస్తు’ తర్వాత మళ్లీ ఇదే సంస్థలో ‘గీత గోవిందం’ సినిమాకు దర్శకత్వం వహించారు పరశురామ్.
‘గీత గోవిందం’తో దర్శకుడిగా 100 కోట్ల క్లబ్‌లోకి చేరారాయన. నెక్ట్స్ గీతా ఆర్ట్స్‌లోనే పరశురామ్ ఓ సినిమా చేయనున్నారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ఓ లీడింగ్ స్టార్‌తో ఈ సినిమా ఉండబోతోంది. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని పరశురామ్ పేర్కొన్నారు. కాగా, పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా చేశారు పరశురామ్. దర్శకుడిగా యువత, సోలో వంటి హిట్ చిత్రాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment