తండేల్‌ జర్నీ ప్రారంభం.. సాయి పల్లవి స్పెషల్‌ అట్రాక్షన్‌ | Naga Chaitanya And Sai Pallavi Thandel Movie Muhurtham Ceremony | Sakshi
Sakshi News home page

తండేల్‌ జర్నీ ప్రారంభం.. సాయి పల్లవి స్పెషల్‌ అట్రాక్షన్‌

Published Sat, Dec 9 2023 1:21 PM | Last Updated on Sat, Dec 9 2023 1:37 PM

Naga Chaitanya And Sai Pallavi Thandel Movie Muhurtham Ceremony - Sakshi

నాగచైతన్య- సాయి పల్లవి కాంబినేషన్‌తో మరో సినిమా ప్రారంభమైంది. లవ్‌ స్టోరీ చిత్రం తర్వాత వారిద్దరూ ‘తండేల్‌’లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు.  మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తండేల్‌ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నాగార్జున, వెంకటేశ్​, సాయి పల్లవి, అల్లు అరవింద్​తో పాటు మూవీ టీమ్ హాజరైంది. వాటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా సాయి పల్లవి నిలిచింది.

'కార్తికేయ 2' మూవీతో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు  తెచ్చుకున్న దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు భారీగానే కసరత్తు చేశాడు. 2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం గుజరాత్‍కు వెళ్లారు. పాకిస్థాన్ దళాలు వారిని పట్టుకొని బంధించాయి. ఈ రియల్‌ కథకు తనదైన స్టైల్‌లో తెరకెక్కించేందుకు ఆయన రెడీ అయ్యాడు.

ఈ సినిమా  కోసం భారీగా బడ్జెట్‌ పెడుతున్నారని పూజా కార్యక్రమంలో నాగ చైతన్య  తెలిపాడు. 'లవ్‌స్టోరి' తర్వాత మళ్లీ సాయిపల్లవితో కలిసి ఇందులో నటించడం. తన వల్ల కథకి మరింత బలం చేకూరినట్టైందని ఆయన అన్నాడు. విస్తృత పరిధి ఉన్న కథ కావడంతో కొంత భాగం ఇండియాలో, కొంత భాగం పాకిస్థాన్‌లో చిత్రీకరణ జరుగుతుందని చైతూ తెలిపాడు. ఈ చిత్రానికి సంగాతాన్ని  దేవి శ్రీ ప్రసాద్‌ అందిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement