
ప్రస్తుతం డిజిటల్ షోలు, వెబ్ సిరీస్‌లో కూడా కనిపిస్తున్నారు స్టార్స్. ఆడియన్స్‌కి వినోదం అందించడానికి మాధ్యమం ఏదైనా సై అంటున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ వెబ్ మీడియమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు చిరంజీవి కూడా వెబ్ మీడియమ్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నారా? అంటే అదే ప్లాన్‌లో ఉన్నారనే వార్త వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఓ వెబ్ సిరీస్ నిర్మించనుందట.
ఈ సిరీస్‌లో చిరంజీవి ముఖ్య పాత్ర పోషించనున్నారట. భారీ బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఈ వెబ్ సిరీస్‌కి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కొరటాల శివతో చిరంజీవి చేస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆరంభం కావచ్చని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment