‘సరైనోడు’లానే ‘శ్రీరస్తు శుభమస్తు’కు కూడా..! | Srirastu Subhamastu Title Song - Launch | Sakshi
Sakshi News home page

‘సరైనోడు’లానే ‘శ్రీరస్తు శుభమస్తు’కు కూడా..!

Published Thu, Jul 21 2016 12:24 AM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

‘సరైనోడు’లానే ‘శ్రీరస్తు శుభమస్తు’కు కూడా..!

‘సరైనోడు’లానే ‘శ్రీరస్తు శుభమస్తు’కు కూడా..!

- నిర్మాత అల్లు అరవింద్
 ‘‘గీతా ఆర్ట్స్ సినిమాల్లో సంగీతానికి మంచి ప్రాధాన్యముంటుంది. సినిమా విడుదలకు ముందే పాటలను శ్రోతల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటాం’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్. ఆయన నిర్మాణంలో దర్శకుడు పరశురామ్ రూపొందిస్తున్న సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. అల్లు శిరీష్ హీరోగా నటించారు. లావణ్యా త్రిపాఠి నాయిక. ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్ ‘శ్రీరస్తు శుభమస్తూ...’ను  బుధవారం విడుదల చేశారు.
 
  ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘పాటలు బాగుంటే సినిమాకు బలం పెరుగుతుంది. ‘సరైనోడు’ సినిమా పాటలను బాగా ప్రమోట్ చేశాం. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా ఆడియోను అలాగే ప్రచారం చేయాలను కుంటున్నాం. సినిమా అందరినీ అలరిస్తుందని చెప్పగలను’’ అన్నారు. దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ- ‘‘కుటుంబ విలువలు తగ్గుతున్న ఈ రోజుల్లో ఫ్యామిలీ గొప్పదనం చెప్పేలా సినిమా ఉంటుంది.
 
 పాత్రల మధ్య కుటుంబంలోని భావోద్వేగాలు ఉంటాయి. టైటిల్ ఉన్నంత బ్లెస్సింగ్‌గా సినిమా వచ్చింది’’ అన్నారు. అల్లు శిరీష్ మాట్లాడుతూ- ‘‘ కొత్త జంట తర్వాత సినిమా ఇచ్చిన నాన్నగారికి థ్యాంక్స్. మంచి కథ, వినోదం ఉన్న సినిమా ఇది. లావ ణ్య సహజంగా నటించింది. తమన్ మ్యూజిక్ హిట్టవుతుంది’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ- ‘‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దర్శకుడు సినిమాను చాలా సహజంగా, కొత్తగా చిత్రీకరించారు’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement