అల్లు వారబ్బాయి ఎప్పుడొస్తాడు? | Allu Sirish Srirastu Subhamastu Movie Release Date Not yet Confirmed | Sakshi
Sakshi News home page

అల్లు వారబ్బాయి ఎప్పుడొస్తాడు?

Published Tue, May 24 2016 2:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

అల్లు వారబ్బాయి ఎప్పుడొస్తాడు?

అల్లు వారబ్బాయి ఎప్పుడొస్తాడు?

గత మార్చిలో తన నెక్ట్స్ సినిమా ఇదే అంటూ ఓ పోస్టర్ను ట్వీట్ చేసిన అల్లువారి చిన్నబ్బాయి శిరీష్, ఆ తరువాత సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఎక్కడి వరకు వచ్చింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అన్న విషయాలపై కూడా క్లారిటీ లేదు.

గౌరవం సినిమాతో హీరోగా పరిచయం అయిన శిరీష్ తరువాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తజంట సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకోవటంతో మూడో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మూడో సినిమాతో ఎలాగైన సక్సెస్ కొట్టాలని సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్లో పరశురామ్ దర్శకత్వంలో శ్రీరస్తూ శుభమస్తూ సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా మార్చ్లోనే రిలీజ్ అవుతుందని ప్రకటించారు. కానీ అప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవటంతో కేవలం ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టేశారు. ఆ తరువాత సినిమాకు సంబందించిన ఎలాంటి వార్త బయటికి రాలేదు. అసలు షూటింగ్ పూర్తయ్యిందా..? ఎప్పుడు రిలీజ్ అవుతుంది..?  అన్న విషయాలపై గీతా ఆర్ట్స్ కూడా క్లారిటీ ఇవ్వటం లేదు. అయితే సినిమా అనుకున్న స్థాయిలో రాకపోవటంతో కొన్ని సీన్స్ రీ షూట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇలా రీషూట్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఎప్పటికీ రిలీజ్ అవుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement