భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న మెగాహీరో! | Allu Sirish charges this much | Sakshi
Sakshi News home page

భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న మెగాహీరో!

Published Tue, Jan 3 2017 8:03 PM | Last Updated on Tue, Sep 5 2017 12:19 AM

భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న మెగాహీరో!

భారీ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్న మెగాహీరో!

కెరీర్‌ తొలినాళ్లలోనే కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ క్లబ్‌లో చేరడమంటే నటులకు మాటలు కాదు. కానీ కేవలం మూడో సినిమాలు మాత్రమే చేసిన మెగా హీరో అల్లు శిరీష్‌ తన తాజా సినిమా కోసం కోటి రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నట్టు సమాచారం.  దర్శకుడు వీఐ ఆనంద్‌ రూపొందించబోతున్న తన తాజా సినిమా కోసం అల్లు శిరీష్‌ రూ. కోటి రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. శిరీష్‌ తాజా సినిమా 'శ్రీరస్తు శుభమస్తు' మంచి విజయాన్ని సాధించింది. శాటిలైట్‌ హక్కుల సహా ఈ సినిమా రూ. 15 కోట్ల బిజినెస్‌ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అతను తన రెమ్యూనరేషన్‌ను కోటికి పెంచినట్టు తెలుస్తోంది.

నిజానికి అల్లు శిరీష్‌ మొదటి రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో అతని తండ్రి అల్లు అరవింద్‌ రంగంలోకి దిగి 'శ్రీరస్తు శుభమస్తు' సినిమాను తెరకెక్కించారు. 'శిరీష్‌కు పెద్ద కుటుంబ నేపథ్యం ఉంది. ఇది ఆయనకు మంచి పబ్లిసిటీ ఇచ్చే అవకాశముంది. అయితే, బాక్సాఫీస్‌ వద్ద అతని సినిమా విజయం మీద మిగతా విషయాలు ఆధారపడి ఉంటాయి' అని సినీ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement