
‘గౌరవం’సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు వచ్చాయి. ఆ తర్వాత కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం లాంటి విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు.
శీరీష్ నుంచి చివరగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన శీరీష్.. ‘గీతా ఆర్ట్స్ ’మూవీతో రీఎంట్రీ ఇస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ చేసిన చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాను నవంబర్4న విడుదల చేయనున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్, ఫస్ట్ లుక్ టీజర్ ,త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment