ఇంట్లో ఉండి బోర్ కొట్టిందో, తన ఆఫీసు ఎలా ఉందో అనుకున్నారో ఏమో కానీ, హీరో అల్లు అర్జున్ గురువారం హైదరాబాద్‌లోని తన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ ఎప్పుడూ ఉండే సందడి, హంగామా ఇప్పుడు కనిపించలేదని నిరాశకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. "చాలా కాలం తర్వాత గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఎలాంటి హరీబరీ లేదు. కరోనా వల్ల ఏర్పడిన ఈ గడ్డు పరిస్థితులు త్వరలోనే అంతం కావాలి" అని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టీ షర్టు ధరించి, డిఫరెంట్ హెయిర్ స్టైల్, గడ్డంతో ఆఫీసు ప్రాంగణంలో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. (భావోద్వేగానికి లోనయిన అల్లు అర్జున్)
ఈ లుక్‌లో బన్నీని చూసిన అబిమానులు ఆశ్చర్యపోతున్నారు. "ఏంటి అన్నయ్య.. కనపడిన ప్రతీ సారి ఏదో ఒక కొత్త లుక్‌లో దర్శనం ఇస్తూ ఉన్నారు" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. "మేము అదే అనుకుంటున్నాం అన్నా.. తొందరగా షూటింగ్ స్టార్ట్ అవాలి. నిన్ను మళ్లీ స్క్రీన్ మీద చూడాలి" అని మరో అభిమాని రాసుకొచ్చారు. కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఫాలోవర్ల సంఖ్య 8 మిలియన్లు దాటేసిన విషయం తెలిసిందే. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం "పుష్ప". ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు. (మరో రికార్డు సృష్టించిన అల్లు అర్జున్!)
Casually dropped in Geetha Arts after a long time . I miss the hustle . Wishing for these tough times to end soon . #besafe pic.twitter.com/fUu20dABr5
— Allu Arjun (@alluarjun) August 20, 2020
Comments
Please login to add a commentAdd a comment