నేను బాగున్నాను.. కోలుకుంటున్నాను: అల్లు అర్జున్‌ | Allu Arjun Shares His Health Update After Covid 19 Diagnosis | Sakshi
Sakshi News home page

నేను బాగున్నాను.. కోలుకుంటున్నాను: అల్లు అర్జున్‌

Published Mon, May 3 2021 4:20 PM | Last Updated on Mon, May 3 2021 8:11 PM

Allu Arjun Shares His Health Update After Covid 19 Diagnosis - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. కోవిడ్‌ సోకిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించిన బన్నీ.. అందరినీ జాగ్రత్తగా ఉండమని తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచించాడు. అప్పటి నుంచి  బన్నీ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. అయితే అల్లు అర్జున్‌కు కరోనా సోకడం వల్ల ఈ సినిమా షూటింగ్‌ తాత్కాలికంగా నిలిచిపోయింది. కానీ జస్ట్‌ రెండంటే రెండు రోజులు బన్నీ షూట్‌లో పాల్గొన్నట్లయితే తను చేయాల్సిన యాక్షన్‌ సీక్వెన్స్‌ పూర్తయ్యేదట.

తాజాగా అల్లు అర్జున్ తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ ఓ పోస్ట్ చేశాడు. స్వల్ప లక్షణాలు ఉన్నాయని, క్రమంగా కోలుకుంటునానని వెల్లడించాడు. తన ఆరోగ్యం బాగుందని, ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నానని తెలిపాడు. తనపై ప్రేమను కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు. .‘అందరికీ హలో.. స్వల్ప లక్షణాలే ఉన్నాయి.. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది.. కరోనా నుంచి కోలుకుంటున్నాను.. ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నాను.. మీరు చూపిస్తున్న ప్రేమకు, ప్రార్థనలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’ అని పోస్ట్ చేశాడు.

చదవండి: బన్నీకి కరోనా.. రెండు రోజులు ఆగితే అది పూర్తయ్యేది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement