Allu Arjun Tests Corona Positive: నా గురించి ఆందోళన చెందవద్దు : అల్లు అర్జున్‌ - Sakshi
Sakshi News home page

నా గురించి ఆందోళన చెందవద్దు: అల్లు అర్జున్‌

Published Wed, Apr 28 2021 11:38 AM | Last Updated on Wed, Apr 28 2021 2:23 PM

Allu Arjun Tests Positive For Corona virus - Sakshi

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. సినీ పరిశ్రమని సైతం కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ‍ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉన్నానని, గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.

ఇక తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందవద్దని, తాను బాగానే ఉన్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్‌కు కరోనా కావడంతో షూటింగ్‌కు బ్రేక్‌ పడింది.

చదవండి: పుష్ప: ఆ రోల్ చేయ‌డానికి ఐశ్వ‌ర్య‌ ఒప్పుకుంటుందా?
అల్లు అర్జున్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సల్మాన్‌ ఖాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement