తమిళ స్టార్ హీరో ధనుశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నానే వరువెన్’(తెలుగులో నేనే వస్తున్నా). సెల్వ రాఘవన్ దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పిస్తుండటం విశేషం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
1 నిమిషం 40 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఇందులో ధనుశ్ క్లాస్, రస్టిక్ రోల్స్‌తో ద్విపాత్రాభినయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టీజర్‌కు యువన్ శంకర్ రాజా అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్‌గా ఉంది. ‘కాదల్ కొండేన్’, ‘పుదుపేట్టై’, ‘మయక్కం ఎన్న’ తర్వాత ధనుశ్-సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాలుగవ చిత్రమిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కమెడియన్ మోగి బాబు, ఇందుజా రవిచంద్రన్, ఎల్లి అవ్రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment