![Color Photo Movie Director Sandeep Raj Next Movie With Geeta Arts - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/4/allu-arjun.jpg.webp?itok=P7GW1hpt)
తన మొదట చిత్రం ‘కలర్ ఫోటో’ తో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నదర్శకుడు సందీప్ రాజ్. ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే వ్యూస్ ను సంపాదించింది. నూతన దర్శకులకు కూడా ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు, నిర్మాణ సంస్థలు అవకాశాలు ఇస్తున్నారు. కథ నచ్చితే వెంటనే వాళ్లతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు సందీప్ రాజ్‌కు కూడా స్టార్ హీరో నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తుంది.
నూతన దర్శకుడైన ‘కలర్ ఫోటో’ సినిమాను తెరకెక్కించిన తీరు ఇండస్ట్రీలో కూడా చాలా మంది ప్రముఖలకు నచ్చింది. అందుకే గీతా ఆర్ట్స్ నుంచి పిలుపు అందుకున్నాడు. ఇప్పటికే సందీప్ రాజ్‌కి గీత ఆర్ట్స్ వాళ్లు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశారు. ఈ సంస్థలో హిట్ అందుకుంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం సందీప్ కి ఉండదు. ఇప్పటికే ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. బహుశా ఈ స్టార్ హీరో ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరో ఎవరనేది మాత్రం తెలియడం లేదు. ఏదేమైనా ఈ మధ్య టాలీవుడ్‌లో నూతన దర్శకుల హవా కొనసాగుతోందనే చెప్పాలి.
( చదవండి: ఒక రాత్రి... నాలుగు కథలు! )
Comments
Please login to add a commentAdd a comment