
‘నా పేరు సూర్య’ పరాజయం తరువాత అల్లు అర్జున్ ఆచితూచి కథలను ఎంపిక చేస్తున్నాడు. అందుకే ఆ మూవీ తరువాతే మరే ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేయనున్నాడని, తమిళ హిట్ మూవీ 96రీమేక్‌లో నటించనున్నాడని, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తదుపరి ప్రాజెక్ట్ ఉండనుందని వార్తలు వినిపించాయి. అయితే ఫైనల్‌గా మాటల మాంత్రికుడు చెప్పిన కథకే ఓకే చెప్పాడు. వీరిద్దరు కాంబినేషన్‌లో తమ చిత్రం ఉండబోతోందని అధికారికంగా ప్రకటించేశారు.
వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. మళ్లీ వీరిద్దరు కలిసి హ్యాట్రిక్‌పై కన్నేశారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో తెరకెక్కించనున్నారు. జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని త్వరలోనే మిగతా వివరాలను ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment