టాలీవుడ్‌లో సినిమా మనుగడ గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా థియేటర్‌కు ప్రేక్షకులు రాకుండా తామే చెడగొట్టామని తాజాగా ఆయన కామెంట్ చేశారు. సినిమా బాగున్నా వెంటనే ఓటీటీలోకి సినిమాలు వస్తుండటంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్ వైపు వెళ్లడం మానేశారు అనేది ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతుంది. దిల్ రాజు చేసిన వ్యాఖ్యల గురించి నిర్మాత బన్నీ వాసు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
‘ఆయ్’ మూవీ సెలబ్రేషన్స్‌లో బన్నీ వాస్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా వారి నుంచి ఆయనకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే 'మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే ఓటీటీలో సినిమా విడుదల చేస్తాం.' అని దిల్‌రాజు వ్యాఖ్యానించారు కదా దీనిపై మేరేమంటారు అని ఒకరు ప్రశ్నించగా.. బన్నీ వాసు ఇలా చెప్పుకొచ్చారు. 'ఇండస్ట్రీలో ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా ఐక్యత లేకుంటే ఏమీ చేయలేం. ఈ అంశంపై ఛాంబర్ నుంచి లేదా ఇంకెవరైనా రూల్స్ పెడితే జరిగే పని కాదు. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసికట్టుగా కూర్చొని చర్చించాలి. బాలీవుడ్‌లో మాదిరి 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే.. థియేటర్లు ఇవ్వమని షరతులు పెట్టారు. అలాంటి నిర్ణయాలు ఇక్కడ కూడా తీసుకుంటే సరిపోతుంది.' అని ఆయన అన్నారు.
ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే తప్పకుండా ఏదైనా సందర్భం ఉండాలని బన్నీ వాసు అన్నారు. రీసెంట్‌గా మహేశ్ బాబు పుట్టినరోజు కారణం వల్ల 'మురారి'కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. అలా ప్రేక్షకుల్లో ఒక మూడ్ క్రియేట్ అయితేనే థియేటర్‌కు వస్తారు. తమ 'ఆయ్' మూవీకి భారీగా పబ్లిసిటీ చేసినప్పటికీ సాధారణ రోజుల్లో విడుదల చేస్తే ఉపయోగం ఉండేది కాదు. కేవలం 25శాతం లోపే ఓపెనింగ్ వచ్చేది. కానీ, ఆగష్టు 15 నుంచి వరుస సెలవులు ఉండటం వల్ల సినిమాకు అడ్వాంటేజ్ దక్కింది. అందుకే ఆయ్ సినిమాకు 45 శాతం ఓపెనింగ్ జరిగిందని బన్నీ వాసు పేర్కొన్నారు. కలెక్షన్ల పరంగా కూడా తమకు గ్రాస్ మాత్రమే కనపడుతుంది కానీ, షేర్ కనిపించడంలేదని ఆయన అన్నారు. గతంలో మాదిరి థియేటర్‌లలో పరిస్థితిలు ఇప్పుడు లేవని బన్నీ వాసు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment