
‘‘ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా లేకున్నా కష్టపడాలి. అల్లు అర్జున్, నాని, కిరణ్ అబ్బవరం, నిఖిల్‌లకు సినిమా అంటే తపన.. అందువల్లే వారు క్లిక్ అవుతున్నారు. సినిమా కోసం నిద్రపోకుండా బాగా కష్టపడతారు’’ అని నిర్మాత ‘బన్నీ’ వాసు అన్నారు. కిరణ్ అబ్బవరం, కశ్మీర జంటగా మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘వినరో భాగ్యము విష్ణు కథ’లో వినోదం, ప్రేమ, థ్రిల్లింగ్.. ఇలా అన్ని వాణిజ్య అంశాలున్నాయి. ఈ చిత్రంలో సిగరెట్, మందు తాగే సీన్లు లేవు.. ఇలాంటి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం కెరీర్ మరో మెట్టు పైకి ఎక్కుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా రషెస్ చూశాక అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే మా నమ్మకం రెట్టింపు అయ్యింది. నా కెరీర్‌లో గుర్తు పెట్టుకునే చిత్రం అవుతుంది’’ అన్నారు కిరణ్ అబ్బవరం.
Comments
Please login to add a commentAdd a comment