Kiran Abbavaram Vinaro Bhagyamu Vishnu Katha First Look Out - Sakshi
Sakshi News home page

Vinaro Bhagyamu Vishnu Katha: బసవన్నతో కిరణ్..మాస్‌ లుక్‌ అదిరింది!

Published Sun, Apr 10 2022 1:49 PM | Last Updated on Sun, Apr 10 2022 2:34 PM

Vinaro Bhagyamu Vishnu Katha First Look Out - Sakshi

వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల సెబాస్టియన్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఈ యంగ్‌ హీరో.. తాజాగా మరో చిత్రాన్ని పట్టాలెక్కించాడు. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై  బ‌న్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘వినరో భాగ్యము విష్ణుకథ’అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బురూ ద‌ర్శ‌కుడిగా తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచయం అవుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ తిరుపతిలో జరుగుతుంది. దాదాపు 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో 80శాతం షూటింగ్‌ పూర్తికానుందని చిత్ర యూనిట్‌ పేర్కొంది. కాగా, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ పోస్టర్‌లో గుడి ముందు  బసవన్నతో లుంగీ కట్టుకొని పర్ఫెక్ట్ మాస్ లుక్ లో అందరిని అలరిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ లుక్ మాస్ ఆడియన్స్ తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement