ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది | Bunny Vasu about Bhale Bhale Magadivoy | Sakshi
Sakshi News home page

ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది

Published Mon, Aug 31 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది

ప్రభాస్...బన్నీ ఇద్దరికీ భలే భలేమగాడివోయ్ భలే నచ్చేసింది

- బన్నీ వాసు
‘‘ఏ సినిమాకైనా దర్శకుడు హార్స్‌లాంటివాడు. ఆ హార్స్ సరిగ్గా వెళుతుందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత నిర్మాతది అని ఓ సందర్భంలో అల్లు అరవింద్‌గారు అన్నారు. ఆ మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఓ నిర్మాతగా సినిమాకి న్యాయం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తాను’’ అని బన్నీ వాసు అన్నారు.  అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్ వంశీ , జీఏ2 బన్నీ వాసు నిర్మించిన చిత్రం ‘భలే భలే మగాడివోయ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలతో పాటు ఇతర విశేషాలను బన్నీ వాసు చెప్పుకొచ్చారు.
 
* విభిన్న ఇతివృత్తాలతో యూత్‌ఫుల్ చిత్రాలు చేయాలన్నదే మా జీఏ2, యూవీ క్రియేషన్స్ ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మా ముందు పెట్టింది అల్లు అరవింద్‌గారే. జీఏ2కి నేను, శిరీష్, యూవీకి వంశీ నిర్మాతలం. కాన్సెప్ట్ విషయంలో, సినిమాలు తయారు చేసే విధానంలో అరవింద్‌గారు మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. ‘‘కథను నమ్ముకుని బడ్జెట్ పెట్టాలి. హీరోను బట్టి బడ్జెట్ పెట్టొద్దు’’ అని అరవింద్‌గారు చెప్పిన మాటలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను.

* రెండేళ్ల క్రితం మారుతి ‘భలే భలే మగాడివోయ్’ కథ చెప్పాడు. కథ వింటున్నప్పుడు లెక్కలేనన్ని సార్లు నవ్వుకున్నాను. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. నేను విన్నదానికన్నా విజువల్‌గా ఇంకా బాగుంది. మారుతి కథ చెప్పినప్పుడు వంద శాతం నవ్వొస్తే, నాని ఆ కథను తన నటన ద్వారా ఆవిష్కరించిన తీరుకి రెండు వందల శాతం నవ్వొచ్చింది.
 
* మారుతి ఈ కథ చెప్పినప్పుడే నాని అయితేనే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే, ఈ సినిమా మొత్తం హీరో ఎంటర్‌టైన్‌మెంట్ మీద సాగుతుంది. నాని హండ్రడ్ పర్సంట్ మంచి టైమింగ్ ఉన్న హీరో. ఈ సినిమాలో తనకు మతిమరుపు ఉంటుంది. అది ప్రేయసికి  తెలియనివ్వకుండా భలే మ్యానేజ్ చేస్తుంటాడు. అందుకే ‘భలే భలే మగాడివోయ్’ అని టైటిల్ పెట్టాం. నాని బ్రహ్మాండంగా చేశాడు. అరవింద్‌గారు ఎడిటింగ్ టైమ్‌లో చూసి, ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేలోపు నానీకి అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చెయ్యి. తనతో ఇంకో సినిమా చేద్దాం’’ అన్నారు. లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’లో సీరియస్‌గా కనిపిస్తుంది. ఇందులో కామెడీ కూడా చేసి, బాగా నటించింది.
 
* హీరోకి మతిమరుపు అంటే ‘గజిని’ సినిమా గుర్తుకు రావడం సహజం. కానీ, ఆ సినిమాకీ ఈ సినిమాకీ పోలికే లేదు. అది యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రం కామెడీ వేలో సాగుతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్స్ అంటూ ఉండవు. కథలో భాగంగానే కామెడీ సాగుతుంది.
 
* ఈ చిత్రాన్ని ప్రభాస్ చూసి, చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఎడిటింగ్ టైమ్‌లో బన్నీ (అల్లు అర్జున్) చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులకు కూడా ఈ చిత్రం బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసే సినిమా. సీన్స్‌లో కానీ డైలాగ్స్‌లో కానీ వెతికినా కూడా ద్వంద్వార్థాలు కనిపించవు. ఈ చిత్రం చూడ్డానికి థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ బయటకు వెళతారు.
 
* మారుతి, నేను రూమ్మేట్స్. వంశీ, నేను లాస్ట్ టెన్ ఇయర్స్‌గా డిస్ట్రిబ్యూషన్‌లో పార్టనర్స్. నాని, వంశీ ఫ్రెండ్స్. సో.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి చేసిన చిత్రం ఇది అనొచ్చు. వంశీ కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడానికి ముందుంటాడు. సంగీత దర్శకుడిగా గోపీసుందర్‌ని తీసుకుందామని వంశీ, మారుతీయే అన్నారు. పాటలు సక్సెస్ అయ్యాయి. రీ-రికార్డింగ్ కూడా చాలా బాగుంటుంది,
 
* ‘ప్రేమకథా చిత్రమ్’లో ఓ రెండు రీళ్లు పడీ పడీ నవ్వుకుంటాం. ఈ సినిమాలో అలా నవ్వుకోవడానికి నాలుగు రీళ్లు ఉంటాయి. సినిమా మీద నమ్మకంతో ఓన్‌గా రిలీజ్ చేస్తున్నాం.
 
* వంశీ, నేను వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాం. మున్నా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా ఓ చిత్రం, ప్రభాకర్ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మించనున్నాం. ఓ రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement