
UV Creations Confirm The Release Date Of Radhe Shyam Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానుల మోస్ట్ అవేయిటెడ్ మూవీ 'రాధేశ్యామ్'. ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. కేకే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ జోతిష్య నిపుణిడిగా కనిపించనున్నాడు. ప్రేరణగా పూజా హెగ్డే తన గ్లామర్‌తో ఆకట్టుకోనుంది. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఇటీవలే హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదలవుతోంది. అయితే తాజాగా భారీ మల్టీస్టారర్ మూవీ రౌద్రం.. రణం.. రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రం వాయిదా పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో రాధేశ్యామ్ చిత్రం కూడా పోస్ట్‌పోన్ అవుతున్నట్లు పుకార్లు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ అభిమానులైతే తీవ్ర షాక్‌కు గురయ్యారు. అయితే ఈ పుకార్లపై రాధేశ్యామ్ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ స్పందించింది. ఈ ఊహగానాలను పటాపంచలు చేస్తూ కీలక ప్రకటన చేసింది. 'రాధేశ్యామ్ విడుదల కావడం లేదన్న ప్రచారాన్ని నమ్మకండి. ఈ నెల 14 తేదినే సినిమాను రిలీజ్ చేస్తున్నాం' అని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. దీంతో పాటు ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేస్తూ రిలీజ్ డేట్‌ను కన్ఫర్మ్ చేసింది యూవీ క్రియేషన్స్.
This New Year Witness the Biggest war between Love & Destiny 💕🚢 from #RadheShyam #HappyNewYear2022#Prabhas @hegdepooja @director_radhaa @UV_Creations @TSeries @GopiKrishnaMvs @AAFilmsIndia @radheshyamfilm pic.twitter.com/pfLSo2VkNM
— UV Creations (@UV_Creations) January 1, 2022