Radhe Shyam Movie Release Date Updates | Read More- Sakshi
Sakshi News home page

Radhe Shyam: రాధేశ్యామ్‌ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది..

Published Thu, Sep 30 2021 7:33 AM | Last Updated on Thu, Sep 30 2021 11:57 AM

Radhe Shyam Makers Stick To The Same Festival Release Date - Sakshi

‘రాధేశ్యామ్‌’ రాకలో ఏ మాత్రం మార్పు లేదని స్పష్టత వచ్చింది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయనున్నట్లు గతంలోనే ప్రకటించింది చిత్రబృందం. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ‘రాధేశ్యామ్‌’ విడుదల కానుంది.

అయితే దేశవ్యాప్తంగా థియేటర్స్‌ రీ ఓపెన్‌ అవుతున్న ఈ తరుణంలో కొన్ని చిత్రాల కొత్త విడుదల తేదీలు తెరపైకి వచ్చాయి. దీంతో ‘రాధేశ్యామ్‌’ డేట్‌ మారే చాన్స్‌ ఉందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే విడుదల తేదీలో ఏ మార్పు లేదని బుధవారం చిత్రబృందం స్పష్టం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement