ప్రేమ కోసం చచ్చే టైప్‌ కాదంటున్న ప్రభాస్‌ | Radhe Shyam First Glimpse Released | Sakshi
Sakshi News home page

రాధేశ్యామ్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది..

Published Sun, Feb 14 2021 9:39 AM | Last Updated on Wed, Mar 3 2021 8:11 PM

Radhe Shyam First Glimpse Released - Sakshi

అభిమానుల నిరీక్షణకు తెర పడింది. 'సాహో' స్టార్‌ ప్రభాస్‌ వీర ప్రేమికుడిగా, బుట్టబొమ్మ పూజా హెగ్డే అతడి మనసును దోచుకున్న ప్రేమికురాలిగా నటిస్తున్న చిత్రం "రాధేశ్యామ్‌". వాలంటైన్స్‌ డే సందర్భంగా ఆదివారం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజైంది. రైలు కూతతో ప్రారంభమవుతున్న ఈ వీడియోలో ప్రభాస్‌ కళ్లు ప్రేమికురాలి కోసం వెతుకుతున్నాయి. రైల్వే స్టేషన్‌లో జన సందోహం మధ్య పూజాను కనుక్కునేందుకు రకరకాల పేర్లతో పిలుస్తున్నాడు ప్రభాస్‌. కానీ అతడి పిలుపు వినిపించినా ఏమీ పట్టనట్లు ముందుకు వెళ్లిపోతూ హీరోను ఉడికిస్తోంది పూజా.

'నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా?' అని పూజా ముఖం పట్టుకుని ప్రశ్నించగా 'ఛ, వాడు ప్రేమ కోసం చచ్చాడు, నేను ఆ టైప్‌ కాదు' అని తేల్చి చెప్తున్నాడు. అంటే బతికుండగానే ప్రేమను సాధించి తీరుతానని పరోక్షంగా మనసులోని ప్రేమను వ్యక్తీకరిస్తున్నాడు. ఇక ఈ ఫస్ట్‌ గ్లింప్స్‌లో ప్రభాస్‌ ముఖంలో కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను జూలై 30న రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ప్రభాస్‌ మరో చిత్రం ఆదిపురుష్‌ విడుదల కానుంది.

ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుందని వినికిడి. మహాజ్ఞానిగా పరమ హంస పాత్రలో కృష్టం రాజు కనిపించనున్నాడు. భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్‌ విన్నింగ్‌ హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తుండటం విశేషం. ఈ చిత్రాన్ని యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్‌ విడుదల కానుంది.

చదవండి: Radhe Shyam: జూలై నెలాఖరున రిలీజ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement