పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. కానీ ఆయన ఖాతాలో మాత్రం సరైన హిట్ పడడం లేదు. బాహుబలి తర్వాత ఆ స్థాయి విజయం ప్రభాస్‌కు దక్కలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఇక ‘ఆదిపురుష్’తో ఎలాగైన పాన్ ఇండియా హిట్ కొడతాడని ఆశపడ్డ ప్రభాస్ ఫ్యాన్స్‌కి నిరాశే ఎదురైంది. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో పాటు పలు వివాదాలు తెచ్చిపెట్టాయి.
అంతేకాదు ఈ చిత్రంతో తన సోదరుడు ప్రమోద్‌కు సంబంధించిన యూవీ క్రియేషన్స్‌కు లబ్ది చేకూర్చాలని ప్రభాస్ ప్రయత్నించాడు. కానీ అది కూడా బెడిసి కొట్టింది. ఆదిపురుష్ ఎఫెక్ట్ యూవీ క్రియేషన్స్‌పై భారీగా పడింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘సలార్’ బిజినెస్ విషయంలో తలదూర్చకూడదని డిసైడ్ అయ్యారట.
(చదవండి: ట్రీట్‌మెంట్ కోసం హీరో వద్ద అప్పు.. క్లారిటీ ఇచ్చిన సమంత)
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాఫ్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నాన్ థియేట్రికల్స్ బిజినెస్‌తో పాటు డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ.200 కోట్లు పెట్టి స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. తెలుగులో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ కోసం రెండు ప్రముఖ బ్యానర్లు పోటీ పడుతున్నాయి. ఇంత బజ్ ఉన్నప్పటికీ ప్రభాస్ మాత్రం బిజినెస్ విషయంలో దూరంగా ఉన్నారట. కేవలం రెమ్యునరేషన్ మాత్రమే తీసుకొని సైడ్ అయిపోరాట.
(చదవండి: క్లీంకార గురించి చిరంజీవి చెప్పిందే నిజం అయిందా.. కలిసొచ్చిన వేల కోట్లు)
రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రభాస్ దాదాపు 100 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 28 ఈ చిత్రం మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment