‘అర్జున్ సురవరం’తో మంచి హిట్ అందుకున్నారు నిఖిల్. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్, ‘బన్నీ’ వాసు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్–ప్లే సుకుమార్ అందిస్తున్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. సుకుమార్, ‘బన్నీ’ వాసు, సూర్య ప్రతాప్‌లతో పని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు నిఖిల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment