Surya Pratap
-
గౌరవంగా ఉంది
‘అర్జున్ సురవరం’తో మంచి హిట్ అందుకున్నారు నిఖిల్. ఇప్పుడు మరో కొత్త సినిమాను ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో సుకుమార్, ‘బన్నీ’ వాసు నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్–ప్లే సుకుమార్ అందిస్తున్నారు. ‘‘గీతా ఆర్ట్స్ సంస్థలో సినిమా చేయడం గౌరవంగా ఫీల్ అవుతున్నాను. సుకుమార్, ‘బన్నీ’ వాసు, సూర్య ప్రతాప్‌లతో పని చేయడం ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు నిఖిల్. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఈ కుమారి దేనికీ కాపీ కాదు!
‘‘సుకుమార్ దగ్గర ‘ఆర్య’ చిత్రానికి సహాయదర్శకునిగా చేశాను. ఆ తర్వాత ‘కరెంటు’ చిత్రానికి దర్శకునిగా అవకాశం వస్తే చేశాను. మళ్లీ సుకుమార్‌గారి దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో చేసే అవకాశం వచ్చింది. ఆయన రచనా శైలి బాగుంటుంది. అది నేర్చుకుందామని చేరాను. చివరికి తాను రాసుకున్న కథను నాకిచ్చి దర్శకత్వం వహించమన్నారు. ఆ విధంగా నా ఈ ఐదేళ్ల జర్నీకి ఓ సార్థకత వచ్చింది’’ అని పల్నాటి సూర్యప్రతాప్ అన్నారు. రాజ్‌తరుణ్, హేబా పటేల్ జంటగా సుకుమార్ కథ అందించి, విజయ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరితో కలిసి నిర్మించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. సూర్యప్రతాప్ మాట్లాడుతూ - ‘‘సుకుమార్ అనుభవాల్లోంచి పుట్టిన కథ ఇది. ఓ హాలీవుడ్ చిత్రం స్ఫూర్తిగా ఈ సినిమా తీశామన్నది కొంతమంది అభిప్రాయం. అయితే ఈ సినిమా పూర్తిగా సుకుమార్ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్తో తీశాం. ఇది దేనికీ కాపీ కాదు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా’’ అన్నారు.