Is Adipurush Movie Releasing On OTT Earlier Than Expected?; Check Here - Sakshi
Sakshi News home page

Adipurush OTT: ఓటీటీలోకి మరో 2 వారాల్లోనే? అలా జరగడంతో

Jun 30 2023 3:32 PM | Updated on Jun 30 2023 4:20 PM

Adipurush OTT early Release In July 2023 - Sakshi

ప్రభాస్ 'ఆదిపురుష్' బాక్సాఫీస్ దగ్గర నెమ్మదించింది. కలెక్షన్స్ దాదాపు అన్నిచోట్ల తగ్గిపోయాయి. జనాలు ఈ సినిమాని మెల్లగా మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో చిత్రబృందానికి అనుకోని పెద్ద అవాంతరం ఎదురైంది. అలా జరగడంతో ఓటీటీలోకి ఈ చిత్రాన్ని అనుకున్న సమయం కంటే ముందే తీసుకొచ్చే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చు?

(ఇదీ చదవండి: 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ)

లీక్ చేశారు!
రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' తీశారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్ నటించారు. టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి థియేటర్లలోకి వచ్చి ఇన్నిరోజులు అవుతున్నా ఈ చిత్రంపై ఏదో ఓ వివాదం నడుస్తూనే ఉంది. ఇప్పుడు అదంతా కాదన్నట్లు పలువురు అజ్ఞాత వ్యక్తులు.. మొత్తం HD ప్రింట్ ని పైరసీ సైట్స్ లో పెట్టేశారు. అయితే అది తమిళ వెర్షన్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో రావడానికి పెద‍్దగా సమయం పట్టకపోవచ్చు.

మరో రెండు వారాల్లో?
ఓవైపు థియేటర్లలో ఉండగానే 'ఆదిపురుష్' ఇలా పైరసీ సైట్స్‌లో ప్రత్యక్షమవడం చిత‍్రబృందానికి పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల బట్టి చూస్తుంటే ఓవైపు సినిమా.. థియేటర్ల దగ్గర ఫెయిల్ కావడం, పైరసీ అయిపోవడం లాంటివి చూసి చిత్రబృందం ఆలోచనలో పడిపోయింది. ఆగస్టులో ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ మరో 1-2 వారాల‍్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

(ఇదీ చదవండి: సీఎం కొడుకు సినిమా హిట్ అయ్యిందా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement