ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా టీజర్, పోస్టర్లు రిలీజ్ చేసినప్పుడే అభిమానులు డౌట్ పడ్డారు. ఎక్కడో తేడా కొడుతోంది, అసలీ చిత్రం వర్కవుట్ అవుతుందా? అని అనుమానించారు. అసలు వందల కోట్లు గుమ్మరించి ఇంత పేలవంగా, నిర్లక్ష్యంగా సినిమా తీస్తున్నారేంటని ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. దీంతో ఓం రౌత్ మరింత టైం తీసుకుని ఈసారి కాస్త మెరుగ్గా టీజర్ విడుదల చేశాడు. పర్వాలేదు, సినిమాలో బాగానే మార్పులుచేర్పులు చేశారు అనుకున్నారంతా!
జూన్ 16న సినిమా రిలీజవగా థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులు బిక్కమొహం వేశారు. ఇంకా ఎడిట్ చేయాల్సింది చాలా ఉందని, అసలు ఇప్పటివరకు వెండితెరపై రామాయణం చూసినవారికి, ఆ కథలు విన్నవారికి ఈ సినిమా ఏమాత్రం నచ్చదని తేల్చేశారు. ఫలితంగా సినిమా రిలీజైన మొదటి షో నుంచే నెగెటివిటీ పెరిగింది. ఆదిపురుష్‌కు దెబ్బ పడింది. దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది.
ఎన్నో విమర్శలు, వివాదాలను దాటుకుని ఆ మాత్రం రాబట్టిన ఈ సినిమా తాజాగా ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. ఆదిపురుష్ ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో రూ.150-200 కోట్లు పెట్టి మరీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి బాక్సాఫీస్ దగ్గర చతికిలపడ్డ ఈ సినిమాకు ఓటీటీలో స్పందన ఎలా ఉంటుందో చూడాలి!
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment