ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ రూ.1100 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో కల్కి ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా రిలీజై 50 రోజులు పూర్తి కావడంతో ఓటీటీకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆగస్టు 22 నుంచి అమెజాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
అయితే ఓటీటీలో కల్కి నిడివిపై నెట్టింట చర్చ మొదలైంది. థియేటర్లలో ప్రదర్శించిన రన్‌టైమ్ కంటే తక్కువ ఉండడంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. థియేటర్లలో 181 నిమిషాలు ఉన్న కల్కి.. ఓటీటీకి వచ్చేసరికి 175 నిమిషాలకే కుదించారు. దీంతో ఈ మూవీలో ఏ సీన్లను తొలగించారనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ట్రిమ్ చేసిన సీన్స్ ఇవే..
కల్కిలో కొన్ని సీన్లను ట్రిమ్ చేయడంతో ఏకంగా ఆరు నిమిషాల రన్‌టైమ్ తగ్గిపోయింది. ఆ సీన్లలో మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్.. నిడివి కాస్త ఎక్కువగా అనిపించడంతో తొలగించారు. ఇందులో ప్రభాస్‌ను కప్ప అని పిలిచే సీన్ కూడా తీసేశారు. ఆ తర్వాత ప్రభాస్ ఇద్దరు భారీ కాయులతో చేసే ఫైట్ సీన్ నిడివిని కూడా తగ్గించారు. ఇక కాంప్లెక్స్‌లోకి వెళ్లిన తర్వాత అక్కడ దిశా పటానీతో ప్రభాస్ సాంగ్‌ను కూడా కట్ చేశారు.
అంతేకాకుండా బీచ్ సీన్లను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. మెరూన్ దుస్తులలో ప్రభాస్‌తో మొత్తం సీక్వెన్స్ ఎత్తేశారు. ఇంటర్వెల్‌కు ముందు దీపికా మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సీన్‌ను ట్రిమ్ చేయడంతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్ తొలగించారు. అక్కడ థీమ్ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్ జోడించారు. ఇకపోతే డబ్బింగ్‌లోనూ అక్కడక్కడా మార్పులు చేశారు.
కారణమిదేనా?
కల్కి 2898 ఏడీ జూన్ 27న రిలీజ్ నాటిటి 181 నిమిషాల నిడివి ఉంది. అంటే 3 గంటల ఒక నిమిషంతో థియేటర్లలో రిలీజైంది. నిజానికి ఇది చాలా ఎక్కువ రన్ టైమ్. ఆ సమయంలో సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చినా.. రన్‌టైమ్ విషయంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. అందువల్లే ఓటీటీలోకి వచ్చేసరికి మేకర్స్ ఏకంగా 6 నిమిషాలను తగ్గించేసినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment