
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ టాలీవుడ్ మూవీ ఓటీటీకి ఎప్పుడెస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా కల్కి ఓటీటీ రిలీజ్‌పై సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది. ఈనెల 23 నుంచే ఓటీటీకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దక్షిణాది హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. హిందీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెలలోనే స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉండడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది.
నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాంగోపాల్ వర్మ అతిథి పాత్రల్లో మెప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment