ప్రభాస్ కల్కి భారీ డీల్‌.. ఏకంగా రెండు ఓటీటీల్లోకి రానుందా? | Prabhas-Nag Ashwin Latest Movie Kalki OTT Deal Goes Viral | Sakshi
Sakshi News home page

Kalki 2898 AD OTT: ఓటీటీలో కల్కి.. ఆ రెండింటితో భారీ డీల్!

Published Thu, Jun 27 2024 9:20 PM | Last Updated on Fri, Jun 28 2024 9:38 AM

Prabhas-Nag Ashwin Latest Movie Kalki OTT Deal Goes Viral

డార్లింగ్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్‌, విజువల్ వండర్‌ 'కల్కి 2898 ఏడీ' ఇవాళ థియేటర్లలో రిలీజైంది. నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కల్కి థియేటర్లలో సందడి చేస్తోంది. ఉదయం బెనిఫిట్ షో నుంచే కల్కి మూవీకి పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

అయితే ఈ మూవీ ఓటీటీ డీల్‌ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తాజాగా 'కల్కి' ఓటీటీ డీల్‌కు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే కల్కి నిర్మాతలు రెండు ఓటీటీ సంస్థలతో భారీ ధరకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో సినిమా రిలీజైన దాదాపు  8 వారాల తర్వాతే కల్కిని ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే 'కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా.. బాలీవుడ్‌ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాకు సూపర్ హిట్‌ టాక్ రావడంతో ఓటీటీ స్ట్రీమింగ్‌ కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సినీ ప్రియులు రిలీజ్ కోసం ఎదురుచూడకుండా.. థియేటర్లకి వెళ్లి చూసేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement